బాబుకి డబుల్ షాక్…పోలీసులు నోటీసులు జారీ

అటు నారా లోకేష్ పాదయాత్రకు, ఇటు చంద్రబాబు రోడ్ షోలకు అణువణువునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. నిభందనలకు విరుద్దంగా యాత్రలు చేస్తున్నారంటూ ఏపీ పోలీసులు తమ పని తాము చేస్తున్నామని అంటున్నారు. తమపై కక్ష్య పూరితంగానే అడ్డంకులు సృష్టించి.. వైసీపీ ప్రభుత్వం తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటూ.. టిడిపి అంటోంది. అయితే.. ఈ క్రమంలోనే.. చంద్రబాబు, లోకేష్ కి మరో షాక్ తగిలింది. చంద్రబాబు అనపర్తి సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొదట సభకు అనుమతి ఇచ్చినప్పటికీ.. ఇప్పుడు తాజాగా ఆ అనుమతిని రద్దు చేస్తూ.. పోలీసులు నోటీసులు కూడా రద్దు చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరో వైపు లోకేష్ పాదయాత్రపై కూడా ఉత్కంఠత నెలకొంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్రకు పెద్ద చిక్కొచ్చి పడింది.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నందున… శ్రీకాళహస్తి పట్టణంలోని చతుర్మాడ వీధుల్లోకి ప్రవేశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కొత్తపేట, తెట్టు, భాస్కర్ పేట, నాయుడుపేట బైపాస్ మీదుగా ఏఎం పుత్తూరు, బీపీ అగ్రహారం మీదుగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బస ప్రదేశం వరకు యాత్రను చేసుకోవచ్చని పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. కావాలనే అనుమతులు రద్దు చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.