వైఎస్సార్ కి జై కొట్టిన పురంధేశ్వరి

ఏపీ బీజేపీలో మరో వివాదం మొదలైంది. జీవీఎల్‌పై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో పెను దుమారమే రేపాయి. ఈ రాష్ట్రంలో రాజకీయాలు అనేవి రెండు పార్టీలకు, రెండు కుటుంబాలకు పరిమితమయ్యే అంశం కాదని తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఏకంగా వైఎస్సార్ , ఎన్ టీఆర్ పేర్లను ప్రస్తావిస్తూ .. వారి ఖ్యాతిని పెంచుకోవడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నారని జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా పేరు కూడా జిల్లాకు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే.. జీవీఎల్‌పై కి ఆ పార్టీ కీలక నేత పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. ఆ ఇద్దరూ కాదు ఆ మహానుభావాలు అంటూ పురంధేశ్వరి ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపును తెచ్చి పేదలకు నిజమైన సంక్షేమం, 2రూపాయాలకే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారని ట్వీట్‌ చేశారు పురంధేశ్వరి. వైఎస్‌ఆర్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీని అందించారని గుర్తు చేశారు.

తాజాగా కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసి జీవీఎల్‌ పై కూడా విమర్శలు చేశారు. వారు చేసే రాజకీయాలు నచ్చకనే పార్టీని వీడుతున్నానంటూ.. ఆయన మీడియా పూర్వకంగా వెల్లడించారు. ఈ సంఘటన నుండి కొలుకోకమునుపే.. మరోసారి జీవీఎల్‌ నోరుజారి మరోసారి వార్తల్లో నిలిచారు. మరి జీవీఎల్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి, వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.