మంత్రి రోజా, నారా లోకేష్ ల మధ్య వార్నింగ్ ల పర్వం ప్రతి రోజూ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రి రోజా లోకేష్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. లోకేష్ ఒక పప్పు శుద్ద, ఒక సుంట, ఒక రాజకీయ అవగాహన లేని ఒక వెటకారపు వేస్ట్ ఫెలో అని రోజా సెటైర్లు వేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా, జగన్ లా పాదయాత్ర చేసి సీఏం అవుతానని పాదయాత్ర మొదలు పెట్టి.. చివరికి ప్రజల్లో నవ్వుల పాలు అయ్యే స్థితికి వచ్చావని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్రకు జనాల్ని బలవంతంగా లాక్కోస్తున్నా ప్రజలు రాని పరిస్థితి నెలకొందని రోజా పేర్కొన్నారు. అద్దె మనుషులను తెచ్చుకొన్నా వారు కూడా చివరికి హ్యాండ్ ఇస్తున్నారని, దానికి కారణం తండ్రి కొడుకుల యాత్రల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, ఆస్థితిలో తాము ఉండకూడదని భావించి లోకేష్ పాదయాత్రకు జనం దూరంగా ఉంటున్నారని రోజా పేర్కొన్నారు.
నా ఇంటికి తెలుగు మహిళలతో చీరె, గాజులు పంపించారు అంటే ఎంత కొవ్వు పట్టింది అంటూ.. రోజా మండిపడ్డారు. మొదట జగన్ కి చీరె, జాకెట్ పంపుతా అన్నది టిడిపి మహిళేనని, అందుకే లోకేష్ కి చీర జాకెట్ పంపుతామన్నామని రోజా క్లారిటీ ఇచ్చారు. మీరు ప్రశాంతంగా యాత్రలు చేసుకుంటే.. మేము మీజోలికి రామన్నారు. అదే మాపై నోరు పారేసుకొని, మాపై దాడులకు తెగబడితే.. మీరు ఎక్కడా తిరగలేరు.. అంటూ మంత్రి రోజా తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. మీరు చేస్తున్న కుట్ర రాజకీయాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ది చెప్తారని.. మంత్రి రోజా టీడీపీకి కౌంటర్ ఇచ్చారు.