ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతోంది. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందే నుంచే సీటు కోసం చాలామంది కాచుకొని కూర్చున్నారు. ఇక ఈ ఎన్నికలు మార్చి 13న జరగనున్నాయి. ఈ నేపధ్యంలోనే స్థానిక సంస్థలకు సంబంధించి బలాన్ని బట్టి అన్ని స్థానాలు దాదాపు వైఎస్సార్సీపీ ఖాతాలోకి వెళతాయని అంచనా వేస్తున్నారు. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. జిల్లాలవారీగా ఆశావహుల జాబితాను పరిశీలించి జాబితా దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అనే చెప్పాలి. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే టికెట్ అని సిఎం జగన్ చెప్తూనే ఉంటారు. ఈ తరుణంలోనే ఓ వైసీపీ నేతకు లక్కీ ఛాన్స్ దక్కిందని, ఆయన పేరును సిఎం జగన్ పరిశీలించి.. దాదాపు ఒకే చెప్పారని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. ఇంతకీ ఆ లక్కీ ఛాన్స్ కొట్టబోయేది ఎవరా అనుకుంటున్నారా..? ఆయనే రవిచంద్రా రెడ్డి. నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల కోటా కింద ఖాళీగా ఉంది. అక్కడ నుంచి రవిచంద్రా రెడ్డికి అవకాశం కల్పిస్తారని, ఈ మేరకు ఆయనను ఖాయం చేశారనే విశ్వసనీయ సమాచారం. YSRCP స్థాపించిన నాటి నుంచి రవిచంద్రా రెడ్డి వైఎస్ జగన్ జగన్ తోనే ఉన్నారు.
ఇంకా చెప్పాలంటే.. ఈ రవిచంద్రా రెడ్డి సిఎం జగన్ కి వీర విధేయుడు అన్న పేరు కూడా ఉంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై ఆరోపణలు చేసిన టిడిపి కి ముచ్చమటలు పట్టించేవారు. సిఎం జగన్ ను ఎవరైనా పన్నెత్తి మాట అంటే.. వారికి వాయింపు ఓ రేంజ్ లో ఇచ్చేవారు. అప్పటి నుండి రవిచంద్రా రెడ్డికి సిఎం జగన్ ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారని ఆ పార్టీలో ఉన్న నాయకులు అంటుంటారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన జగన్ కోసం తన వాయిస్ వినిపిస్తున్నారు. సీఏం జగన్ చేస్తున్న అభివృద్ది, ప్రజలకు కలుగుతున్న మంచిని గూర్చి
రవిచంద్రా రెడ్డి మీడియా ముఖంగా ప్రజలకు తెలుపుతూ.. సిఎం జగన్ పై విషం గక్కుతున్నవారిపై తనదైన శైలిలో కత్తులు దూస్తారు. ఆయన మాట్లాడే తీరుకి వైసీపీలో కూడా ఆయనను అనుసరించే వారు చాలా మంది ఉన్నారు. పార్టీ కోసం వినిపిస్తున్న తన వాయిస్ ని చాలామంది నొక్కాలని చూసినప్పటికీ.. ఆయన ఏమాత్రం అదరక, బెదరక.. జగన్ సర్కారు ప్రజలకు చేస్తున్న మంచిని చాటి చెప్తున్నారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే.. సవాలక్ష ఉన్నాయి. పార్టీ అభ్యున్నతి కోసం గట్టిగా పోరాడుతున్నారు కాబట్టే ఆయనకు ఈ చక్కటి అవకాశం దక్కనుందని విశ్వసనీయ సమాచారం.