ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. వచ్చే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కానున్నాయి. ఈ నేపధ్యంలోనే.. సిఎం జగన్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పని తీరు మెరుగ్గా ఉంటేనే.. టికెట్ లేకుంటే నో టికెట్ అని కూడా క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వైసీపీలో అక్కడక్కడా వర్గ పోరుకు మాత్రం పుల్ స్టాప్ పడని పరిస్థితి అధికార పార్టీలో నెలకొంది. ఆధిపత్య ధోరణి పెరిగిపోతూ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారీగా వ్యతిరేకతను మూటకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కైకలూరు నియోజకవర్గం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆకక్డ ప్రస్తుత ఎమ్మెల్యేపై పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. దూలం నాగేశ్వర రావు తనకున్న పదవిని దుర్వినియోగం చేస్తున్నారని.. అక్కడి నాయకులు బహిరంగంగానే అంటున్నారు. ఎమ్మెల్యే తన ఇద్దరు కుమారుల ఆదేశాలు లేనిదే అక్కడ ఏ పని జరగదు అంటున్నారు.. మరో వర్గం నాయకులు. దీంతో ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు తీరుపై అంతకంతకూ గ్రూపు తగాదాలు తలెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే తీరుకు అక్కడ మరో గ్రూప్ ఇప్పటికే కైకలూరు నియోజకవర్గంలో తమ పని తాము చేసుకుపోతుంది. బీసీ సామాజికవర్గానికి చెంది నేతలు ఓ గ్రూపుగా ఏర్పడి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డానికి ప్రభుత్వం అడ్డంకి చెప్పకపోవడం ఇక్కడ గమనార్హం. కైకలూరులో రంగంలోకి దిగిన ఆ లేడీ లీడర్ ఎవరంటే.. శారద అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈమె వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారని.. ఇప్పటికే ఆమెకు బెదిరింపులు వెళ్లాయని స్వయంగా వైసీపీ నేత శారద ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ౦గానే ప్రకటించారు. స్వయంగా అధికార పార్టీ నేతలే సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఫిర్యాధులు చేయడం… పలు రకాల చర్చలకు దారి తీస్తుంది. అయితే.. ఇప్పటికే అక్కడ టిడిపి ఇంచార్జ్ జయమంగళ వెంకటరమణ వైసీపీలో చేరి ఎమ్మెల్సీ హామీని పొందుకున్నారు. కానీ ఈ గ్రూపు తగాదాల వల్ల పార్టీకి వస్తున్న మైలేజ్ పై దెబ్బకొట్టే విధంగా అక్కడి ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని లోకల్ టాక్. మరి ఈ వివాదం చిలికి చిలికి గాలి వనలా మారకమునుపే.. సీఏం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.