బాబుకి షాక్.. జగన్ కి జై కొట్టిన బీసీ నేత

రాజకీయాలలో ఎంత కష్టపడి పని చేసినా ఫలితం దక్కదు. అలా చాలామంది రాజకీయాలలో విసిగి వేశారిపోయిన వాళ్ళు ఉన్నారు. పార్టీ కోసం తమ పనులు మానుకొని ఆస్తులను అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వారే ప్రస్తుతం టీడీపీలో ఒక్కొక్కరు బయటపడుతున్నారు. పార్టీ కోసం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ.. ఫలితం దక్కకపోగా తమను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ.. టిడిపిలో ఉన్న కొందరు నాయకులు తమ ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఈ నేపధ్యంలోనే టిడిపి కి మరో ఎదురు దెబ్బ తగిలింది. మరో టీడీపీ సీనియర్ నేత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబుకి గట్టి షాక్ ఇచ్చారు. బాబుకి షాక్ ఇచ్చిన ఆ టీడీపీ నేతకు.. సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా వైసీపీలో చెరిపోయిన సిపాయి సుబ్రమణ్యంకి ఎమ్మెల్సీ సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఎట్టకేలకే.. ఏపీలో ఎమ్మెల్సీల అభ్యర్ధులను వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ లిస్ట్ లో డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం పేరు ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈయన బీసీ సమాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు. టీడీపీలో బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని.. అందుకే పార్టీలో కొనసాగలేనని, టీడీపీకో దండం అంటూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేస్తూ కన్నీటిపర్యంతం అయ్యారు. బీసీలకు టీడీపీలో ప్రాధాన్యత లేదని.. ఇకపై కూడా ఇవ్వరని, చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం. 15 ఏళ్లపాటు టీడీపీలో పనిచేసినప్పటికీ తగిన గుర్తింపు లేదని.. కష్టపడి పని చేసేవారికి కాకుండా తన సామాజిక వర్గ నేతలకే బాబు పదవులు కట్టబెడుతున్నారని సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలోనే మరోసారి బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తూ ఏకంగా 11 మంది బీసీలకు సీఎం సముచిత స్థానం కల్పించడం పట్ల బీసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.