ఒక ఏడాది ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది.. అధికార, ప్రతిపక్ష పార్టీలలో టిక్కెట్ల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు.. పార్టీలు కూడా ఏ స్థానాలలో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి అని సర్వేలు చేపిస్తూ లెక్కలు వేస్తున్నాయి.. ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ వచ్చే ఎన్నికలను చాలా కీలకంగా తీసుకున్నారు.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లు గా ఉన్న చాలా మందికి వచ్చే ఎన్నికలలో జగన్ టిక్కెట్ ఇవ్వరు అనే వార్తలు చాలా బలంగా వినిపిస్తున్నాయి.. ఇప్పటికే జగన్ సొంతంగా ప్రతి నియోగకవర్గం, ప్రతి ఎమ్మెల్యే గురించి పూర్తిస్థాయిలో సర్వే చేపించుకొని ఒక రిపోర్ట్ తయారు చేపించుకున్నారు అని ఆ రిపోర్ట్ ప్రకారం కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలలో టిక్కెట్ కోల్పోనున్నారు..
రాష్ట్రంలో పలు నియోజకవర్గాలలో వర్గ పోరు చాలా బలంగా ఉంది ముఖ్యంగా వైసీపీ లో అదే పార్టీకి చెందిన నాయకులు మధ్యలో అభిప్రాయభేదాలుతో పాటుగా సమన్వయము లోపించడం, ఇలా పలు కారణాల వలన వర్గపోరు తారాస్థాయికి చేరడం పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం అంతంత మాత్రంగానే ఉందని చెప్పాలి. ఇలాంటి నియోజకవర్గాలలో ఒకటి కైకలూరు.. కైకలూరు నియోజకవర్గం లో ప్రస్తుతం దూలం నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహిస్తున్నారు అయితే కైకలూరు నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పార్టీ లో పనిచేస్తూ పార్టీ కోసం పాటుపడిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళా నాయకురాలు శ్రీమతి టీ . శారద గారు.. 2014, 2019 లో పార్టీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ రేస్ లో ఆమె కూడా ఉన్నారు.. అయితే అనుకోని విధంగా ఆ రోజు ఎన్నికల ముందు 2014 లో ఉప్పల రాంప్రసాద్ గారికి 2019 లో దూలం నాగేశ్వరరావు గారికి పార్టీ టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది.. అయినా కూడా పార్టీ గెలుపు ముఖ్యం అని భావించి పార్టీ కోసం శారద గారు పనిచేశారు..
ఇదే నియోజకవర్గం నుంచి జయమంగళ వెంకటరమణ గారు టీడీపీ నుంచి వైసీపీ లో చేరడంతో 2024 ఎన్నికలలో అయన కూడా టిక్కెట్ రేస్ లో ఉంటారు అనుకున్నారు కానీ జగన్ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడంతో అయన రేస్ నుంచి తప్పుకున్నట్లే.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న దూలం నాగేశ్వరరావు గారి మీద కొల్లేరు విషయంలో పలు అవినీతి ఆరోపణలు, అలానే నియోజకవర్గం లో ప్రజల నుంచి వ్యతిరేకత చాలా బలంగా ఉందని, అదే సమయంలో పార్టీ కోసం అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యే కాకపోయినా శ్రీమతి ట్. శారద గారు గడప గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు పార్టీ ని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు.. వీటన్నిటి గురించి పూర్తి స్థాయి సమాచారం తో పాటుగా అన్ని విషయాలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందని, సాధారణంగానే మహిళా సాధికారతకు పెద్దపీట వేసే జగన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీమతి టి . శారద గారికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం..
ఓటు బ్యాంకు పరంగా చూసుకున్నా కాపులకు 45000 ఓటింగ్ , ఎస్సీ – 30000, ST – 8000, మాస్త్యకారులకు – 10000, యాదవ – 30000, గౌడ – 30000 ఓటింగ్ ఉంది ఈ ప్రకారం చూసుకున్నా బీసీ ఓటు బ్యాంకు 70000 వరకు ఉంది… దీని ప్రకారం చూసుకున్నా శ్రీమతి శారదగారికి టిక్కెట్ ఈ సారి 100% వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదే నిజమైతే కైకలూరు నియోజకవర్గంలో ఈ సారి కూడా వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది