ఎన్టీఆర్ సర్కిల్ కు రా..మీరో మేమో తేల్చుకుందాం

1.సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం జగన్…
సామాజిక న్యాయానికి సీఎం జగన్ ప్రతిరూపమని ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆనంద వ్యక్తం.

2.చంద్రబాబు పెంపుడు కుక్కలతో మాపై మొరిగిస్తున్నాడు..
టీడీపీ వెబ్ సైట్, సోషల్ మీడియాలలోనే తన కుటుంబసభ్యులపై అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని ఎమ్మెల్యే వంశీ స్పష్టం.

3.ఏపీకి మరిన్ని వందేభారత్ రైళ్లు నడపాల్సిన అవసరం ఉంది..
స్లీపర్ కోచ్ లతో వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందని విజయసాయిరెడ్డి వెల్లడి.

4.రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మార్చుతున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయ0..
పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.

5.అమరరాజా కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ
పీసీబీ నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసమే ఈ నిలుపుదల అని సుప్రీం ధర్మాసనం వివరిణ.

6.నేను ఎవరి జోలికి వెళ్లను… నా జోలికి వస్తే వదలను..
గన్నవరంలో జరిగే ప్రతి ఘటనతో నాకేంటి సంబంధం? అని వల్లభనేని వంశీ ఆగ్రహం.

7.రేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
ప్రస్తుతం ఇస్తున్న రేషన్ బియ్యానికి బదులు రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయ౦.

8.స్కూటీపై చిన్నారి మృతదేహం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..
విశాఖ కేజీహెచ్ స్టాఫ్ నర్సు కృష్ణవేణి సస్పెండ్

9.దమ్ముంటే ఎన్టీఆర్ సర్కిల్ కు రా.. మీరో మేమో తేల్చుకుందాం.
వల్లభనేని వంశీకి బుద్ధా వెంకన్న సవాల్.

10.నీ సైకో ఇజానికి ఎవరూ భయపడటం లేదు జగన్ రెడ్డి..
పులివెందుల అరాచకాన్ని, సంస్కృతిని, దౌర్జన్యాలను కృష్ణా జిల్లాకు చూపించారని దేవినేని ఉమా విమర్శ