గుజరాత్లో ఓ మాజీ సర్పంచ్ నోట్ల వర్షం కురిపించారు. కెర్రీ తహసీల్లోని అగోల్ గ్రామంలో తన మేనల్లుడు రజాక్ పెళ్లి సందర్భంగా మాజీ సర్పంచ్ కరీమ్ యాదవ్ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్బంగా బిల్డింగ్ పై నిలబడి 500 రూపాయల నోట్లను ప్రజలపై విసిరారు. మొత్తం 50 లక్షల చల్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.