ఏపీ రాజకీయాలలో విమర్శలకు ప్రతివిమర్శలు తెగ ఊపందుకుంటున్నాయి. గన్నవరంలో జరిగిన ఘటనతో టిడిపి – వైసీపీ నేతల మధ్య మాటలు తూటాల్లా పెళుతున్నాయి. ఈ క్రమంలోనే.. మ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.అచ్చెన్నాయుడు చిట్టా మొత్తం విప్పుతానంటూ.. చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం వంశీ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చెన్నాయుడు ఓ సమయంలో.. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ విషయం పెద్దదైందని, ఆ సమయంలో అచ్చెన్నాయుడు చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయని.. తన జోలికి వస్తే.. అందరి చిట్టా విప్పుతానని వల్లభనేని వంశీ టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. ఓ మహిళా ఆఫీసర్ పై అసభ్యంగా ప్రవర్తించి ఆ తర్వాత చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నారని వివరించారు. చంద్రబాబు బహిరంగ లేఖపైనా వల్లభనేని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబునాయుడికి అధికారం దక్కలేదని తమ కులానికి చెందిన పత్రికలు బాధలో ఉన్నాయని, అందుకే గోబెల్స్ తరహాలో ప్రచారం చేస్తున్నాయని మండిడ్డారు. చేతకానోడు రాసే ఉత్తరాలతో ఉపయోగం ఉండదని, డబ్బు కోసం చంద్రబాబు పదవులు అమ్ముకున్నాడని వంశీ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే.. అచ్చెన్నకు సంబంధించిన కొన్ని పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.