చంద్రబాబుకు తాజాగా ఘోర అవమానం జరిగింది. ఇదే మాటను స్వయంగా కొందరు టీడీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. ఈ అవమానాన్ని భరించలేక.. చంద్రబాబు బాధపడ్డారని.. వెంటనే తిరుగు ప్రయాణం కూడా అయ్యారని.. చెబుతున్నారు. మరి ఇంతకీ చంద్రబాబును అంతగా వేధించిన ఘటన ఏంటంటే. ఏపీలో కొత్త గవర్నర్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా.. కొత్త గవర్నర్‌తో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సిఎం జగన్‌తోపాటు.. మంత్రులు, ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా హాజరయ్యారు. అయితే చంద్రబాబుకు అవమానం జరిగింది అని టిడిపి నేతలు అంటున్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. అవేంటంటే..ప్రధాన ప్రతిపక్ష నేతను సహజంగా స్టేజ్ పైన ముఖ్యమంత్రి పక్కన లేదా.. అదే వరుసలో కూర్చోబెట్టాలి. కానీ మండలి చైర్మన్ పక్కన కూర్చోబెట్టారట. గవర్నర్ ప్రమాణ స్వీకారం అనంతరం.. గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించేందుకు స్టేజ్ మీదకు ఆహ్వానించాలి.. కనీసం తమ నాయకుడిని స్టేజ్ మీదకు కూడా ఆహ్వానించలేదని తెలుగు తమ్ముళ్ళు తెగ బాధ పడిపోతున్నారు. ఆ సమయంలో బాబును అసలు పొట్టయించుకోలేదట. ఇలా ఇంకొన్ని అవమానాలు జరగటంతో చంద్రబాబు రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చేశారట. బాబును పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రభుత్వానికి తమపై ఎందుకు ఇంత కక్ష అని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.