సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సర్వే.. వైసీపీ సంబరాలు

ఏపీలో ఎన్నికల హీటు మరింత రాజుకుంటుంది. వచ్చే ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు మరింత కీలకంగా మారనున్నాయి. గెలుపు అనేది అన్ని పార్టీలకు అత్యంత ప్రాధాన్యం అనే చెప్పాలి. గెలుపు కోసం కీలక నేతలంతా ప్రజల బాట పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఇప్పటికే పలు సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఒక్కో సర్వే రిపోర్ట్ ఒక్కోలా ఉంటోంది. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నాయి. అయితే ఆయా పార్టీలు చేయించుకున్న సర్వేల్లో వారిదే అధికారం అని చెబుతున్నారు. తాజాగా ఓ సర్వే సైతం వచ్చే ఎన్నికల్లో వైసీదే గెలుపు అని తేల్చి చెప్పింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ చేపట్టిన సర్వే తాజాగా ఫలితాలను తెలిపింది. ప్రజలతో ఫేస్ టూ ఫేస్ ఈ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో రకరకాల అంశాలపై, రకరకాల సమీకరణాలతో ఈ సర్వే అయితే చేపట్టడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 130 సీట్లు వస్తాయని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే తేల్చి చెప్పింది. టిడిపికి 39 నుంచి 46 సీట్లు, ఇక జనసేన విషయానికొస్తే.. 3 నుంచి 5 సీట్లు వస్తాయని ఈ సర్వేలో పేర్కొంది. 15 స్థానాలు అటు ఇటుగా ఉంటాయని ఈ సర్వే పేర్కొంది. ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఇవి.

ఇక టీడీపీ జనసేన కలిసి పోతే చేస్తే.. చివరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కూడా చూద్దాం. పొత్తులలో కూడా వైసీపీకి 100 నుంచి 110 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. టీడీపీకి 45 నుంచి 55 స్థానాలు, జనసేనకు 5 స్థానాలు వస్తాయని సర్వే పేర్కొంది. 19 స్థానాలు అటు ఇటుగా ఉంటాయని ఈ సర్వే పేర్కొంది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నా సరే పెద్దగా సీట్లలో ఏమీ తేడా లేదు. సీట్లు తగ్గినా చివరికి విజయం వైసీపీదేనని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో కూడా షేక్ చేస్తోంది. దీంతో వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేస్కుంటున్నాయి. అయితే కేవలం సర్వేలను నమ్మి.. గెలుపోటములను డిసైడ్ చేయలేమ౦టున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.