1.’జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీలోకి ఆహ్వానించడానికి లోకేష్ ఎవరు?’
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ని చంద్రబాబు వాడుకుని వదిలేశారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.
2.వివేకా కేసులో విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదు..
విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధమని భాస్కర్ రెడ్డి స్పష్టం.
3.ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యోగార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..
ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యుఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి పెంచుతూ నిర్ణయం.
4.సీఎం జగన్ ఖాతాలో మరో రికార్డ్..
జాతీయ స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీకి మరో అవార్డు..
5.ఏపీ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఢిల్లీ పర్యటన..
నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గవర్నర్ భేటీ.
6.చంద్రబాబు సీఎం అవడం కోసం ఈనాడు ఎంత నీచనికైనా దిగజారుతుంది..
ఈనాడు దినపత్రిక రాతలు సమాజానికి హానికరం అంటూ మంత్రి గుడివాడ అమర్నాధ్ ధ్వజ౦.
7.మార్చి 2న తారకరత్న పెద్ద కర్మ..
కార్డుపై వెల్ విషర్లుగా బాలకృష్ణ, విజయసాయిరెడ్డిల పేర్లు
8.గన్నవరం టీడీపీ కార్యాలయంపై ప్రభుత్వమే దాడి చేయించింది..
దాడి చేస్తారని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ముందే తెలుసని వర్ల రామయ్య ఆరోపణ.
9.మా జగన్ అన్న బ్రాందీ షాపుల్లో డిజిటల్ చెల్లింపులు అస్సలు నడవవు..
బ్రాందీ షాపుల్లో క్యాష్ కట్టాల్సిందే.. సాయంత్రానికి కంటైనర్లలో నోట్ల కట్టలు తోలాల్సిందేనని సోమిరెడ్డి సెటైర్లు.
10. తిరుపతిలో నిర్వహిస్తున్న నారా లోకేష్ పాదయాత్రలో బాలకృష్ణకు అవమానం..
ఓ సమావేశంలో నేను చిరంజీవి ఫ్యాన్ అంటూ లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.