జేడీకి దిమ్మతిరిగే కౌంటర్..వైసీపీలోకి వెళితే విజయం పక్కా..!

ఆయన ఒక ఐ.పి.ఎస్ ఆఫీసర్. ఆయనకు భారత దేశంలో పేరు ప్రఖ్యాతలు పొందిన అధికారి. 2006 లో ఇండియన్ పోలీస్ మెడల్ పొందారు. కానీ ఆయన అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చి ప్రస్తుతం ఓ ప్రశ్నగా మిగిలిపోయారు. ఆయన మరెవరో కాదు.. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.
మాజీ జేడీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఎంతో కుతూహలంగా ఉన్నారు. అయితే ఆయన జనసేనను వీడిన ఆర్వాత ఏ పార్టీలోనూ చెరకపోవడంపై పలు రకాల ప్రశ్నలు వస్తున్నాయి. అలానే అనేక రకాల ఊహాగానాలు , ప్రచారాలు సాగుతున్నాయి. అయితే.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై క్లారిటీ అయితే ఇస్తున్నారు కానీ.. ఈ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వని పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. అవసరమైతే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపారు. తన ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. మరి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన విజయం సాధిస్తారా..? తమ అభిమాన పార్టీకి ఓట్లేయకుండా ఎవరో స్వతంత్ర అభ్యర్థికి అక్కడి ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారా..? ఒంటరిగా పోటీ చేస్తా అని అసలు జేడీ ఏ దైర్యంతో అంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట.

2019 ఎన్నికల్లో లక్షీనారాయణకు 2,88,874 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన బాలయ్య చిన్న అల్లుడు భరత్ కు 4,32,492 ఓట్లు పోలయ్యాయి. ఇక, వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకు 4,36,906 ఓట్లు రాగా, ఆయన విజయం సాధించారు. లక్షీనారాయణ 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా భరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జనసేన – టిడిపి పొత్తులు పెట్టుకుంటే అక్కడ రాజకీయ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది అన్న చర్చలు వస్తున్నాయి. అక్కడ పోటీ మాంచి ఢీ ఢీ గా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని కూడా పలు రకాల చర్చలు వస్తున్నాయి. ఆయన ఆ పార్టీలోకి వచ్చినా గెలుపు అనేది నల్లేరుమీద నడకే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే.. పక్కాగా విజయం ఆయనదే అంటున్నారు విశ్లేషకులు మరియు నెటిజన్లు. మరి జీడీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి చిక్కుల్లో పడతారో, లేక ఏదో ఒక పార్టీలో చేరి ఈసారైనా విజయం సాధించడంలో కృషి చేస్తారో చూడాలి.