టీడీపీకి వంగవీటి రాధా రాజీనామా..దుమ్మురేపుతున్న ట్వీట్స్

వచ్చే ఎన్నికలు రాజకీయ నాయకులకు అత్యంత కీలకం కానున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇదొక మహత్తరమైన సదవకాశం అనే చెప్పాలి. రాజకీయ వారసులకు ఇదొక డూఆర్ డై అనే చెప్పాలి. రాజకీయ వారసులై ఉండి రాజకీయాలలో రాణించని వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో వంగవీటి రాధా ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వంగవీటి రంగా తనయుడిగా ఈపాటికి ఆయన ఓ రేంజ్ లో ఉండాలి. కానీ ప్రస్తుతం ఆయన పార్టీలు మారుతూ.. నిలకడ లేకపోవడం వల్లనే తనకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని పబ్లిక్ అంటున్నమాట. ఆయన రాజకీయ పయనంపై ఎలా ఉండబోతోంది.. 2024 ఎన్నికలు, రాజకీయ భవిష్యత్‌పై క్లారిటీతో ఉన్నారా. టీడీపీలోనే కొనసాగుతారా, పార్టీ మారిపోతారా. కొద్దిరోజులుగా ఇవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అయితే ప్రస్తుతం.. వంగవీటి రాధాకు సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆయన టీడీపీకి రాజీనామా చేశారని, త్వరలో జై కాపు నినాదంతో జనసేన పార్టీలో చేరబోతున్నారని.. కొందరు ట్విటర్ లో పోస్ట్ లు పెడుతున్నారు.

వంగవీటి రాధా జనసేనలో చేరితే.. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. అయితే ఒకవేళ టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటే సీట్ల సర్థుబాటు సమస్య కూడా ఉంది. ఒకవేళ జనసేన నుంచి రాధా పోటీ చేస్తే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన ఆయన.. విజయవాడ సెంట్రల్ సీటును ఆశించారు. కానీ ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండటం, ఆ తర్వాత కొడాలి నాని, వల్లభనేని వంశీ తో చర్చలు.. ఇవన్నీ చూశాక ఆయన వైసీపీలోకి జంప్ అవుతారని ప్రచారం సాగింది. ప్రస్తుతం వంగవీటి రాధా.. జనసేనలోకి రావడం పక్కా అని ట్విటర్ లో ట్వీట్ లు దర్శనమిస్తున్నాయి. అమరి ఈ వార్తలపై వంగవీటి రాధా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.