ఏపీలో మూడు రాజధానుల హీటు రాజుకుంటుంది. విశాఖ నుంచి ఎప్పుడు పాలన మొదలు పెట్టాలి అన్నదానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి డేట్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఉగాది నుంచి విశాఖనే ఏపీకి రాజధాని కాబోతుందా..? విశాఖలో సీఎం ఉండేందుకు నివాస భవనం కూడా సిద్ధమైందా? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వైసీపీ ఒకటే మాట అంటోంది. తమది అదే బాట అంటోంది. ఏది ఏమైనా ఉగాదికి విశాఖలో పాలనా రాజధాని చేసి తీరుతాం. వికేంద్రీకరణకే కట్టుబడి ఉంటాం అని ఇప్పటికి పలు మార్లు వివరిస్తూనే ఉన్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. సోమ మంగళవారాలు విశాఖ నుంచి పాలన సాగించి.. బుధవారం ఉదయం రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో గ్రామ పర్యటనకు వెళ్లాలని సీఎం నిర్ణయించినట్లు వైసీపీ కీలక నేతలు చెబుతున్న మాట. ప్రతీ బుధవారం ఎంపిక చేసిన గ్రామానికి వెళ్లి రాత్రికి అక్కడే పల్లె నిద్ర చేస్తారట. మళ్లీ ఉదయాన్నే అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించి గురువారం అక్కడ నుంచి అమరావతి వెళ్తారట. శుక్ర, శని, ఆదివారాలు సీఎం జగన్ అమరావతిలో ఉండబోతున్నారట.
రిషికొండలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అధికారిక భవనం, కార్యాలయం పూర్తయ్యే వరకు విశాఖలో హార్బర్ పార్క్ పేరుతో ఉన్న విశాఖ పోర్ట్ గెస్ట్ హౌజ్‌లో సీఎం జగన్ బస చేయబోతున్నారట. సువిశాలమైన వాతావరణంలో ఏర్పాటు చేసి ఉన్న ఈ గెస్ట్ హౌజ్‌లో ఒక వీఐపీ సూట్‌తో పాటు కొన్ని మిని సూట్లు, వీఐపి రూమ్స్ ఉన్నాయి. చుట్టూ పచ్చదనం నిండి ఉండి అవసరమైన పార్కింగ్ స్పేస్ కూడా ఉంటుంది అంటున్నారు. ఏది ఏమైనా..? త్వరలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ లో విశాఖ రాజధానిపై పూర్తి క్లారిటీ వస్తుంది.. ఎప్పటి నుంచి పాలన మొదలు పెట్టేది.. విశాఖపై పూర్తి మాస్టర్ ప్లాన్ ను పెట్టుబడి దారులకు ప్రభుత్వం వివరించే అవకాశం ఉంది. అయితే.. తమ సొంత నాయకుల నుండే ఒక ప్రశ్న చంద్రబాబుకు అవమానకరంగా మారింది. ఏపీలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండాలని తాజాగా ఓ టిడిపి సర్పంచ్ బాబుకు సూచన ఇచ్చారు. అసలు చంద్రబాబుకు ఇప్పటి వరకు కుప్పంలో సొంత ఇల్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. చంద్రబాబు కరకట్టపై కట్టుకున్న గెస్ట్ హౌస్ కూడా అక్రమంగా నిర్మించిందేనని వైసీపీ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేసింది. అంటే చంద్రబాబుకు ఏపీలో సొంత ఇల్లు కూడా లేదన్నమాట.