దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవండి..సీఎం జగన్ సవాల్

1.మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉంది…
కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదంటూ తెనాలి సభలో సీఎం జగన్ సెటైర్లు.

2.దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవండి
చంద్రబాబు, పవన్ లకు సీఎం జగన్ సవాల్..

3.ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చెబుతా౦..
14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు జరుగుతాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడి.

4.ఏపీకి మంచి జరిగే అవకాశం ఉంది..
విభజన చట్టం కేసులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభ పరిణామమన్న ఉండవల్లి అరుణ్ కుమార్.

5.ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ స్వతంత్ర అభ్యర్థి ముసుగులో పోటీ చేస్తోంది..
బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి ఆనెపు రామకృష్ణ ఫోన్ స్విచాఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్టు మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడి.

6.2024 ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి అధికారంలోకి వస్తా౦..
ఏపీలో అధికారం తమదేనన్న సోము వీర్రాజు

7.28 కి.మీ దూరానికి హెలికాప్టర్ ప్రయాణమా?..
తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్ లో ప్రయాణించడంపై జనసేన నేత నాదెండ్ల విమర్శ.

8. ఎమ్మెల్యే ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు..
ప్రస్తుతం అంజుమన్ కమిటి అధ్యక్షుడుగా ఉన్న కనుమ.

9.బటన్ నొక్కుడుతో రైతులకు ఒరిగిందేమీ లేదు..
మూడున్నరేళ్లలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సోమిరెడ్డి ఆరోపణ.

10. నారా లోకేష్‌ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు..
చంద్రగిరి, మామండూరు దగ్గర యువగళం పాదయాత్ర ఫ్లెక్సీలను తొలగించిన రెవెన్యూ అధికారులు.