రాజధాని భూముల కేసులో టీడీపీ నేత నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 6న విచారణకు రావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు రావాలని సీఐడీ నోటీసులు ఇచ్చింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో నారాయణకు గతంలో పలుమార్లు విచారించిన సీఐడీ.. ఈసారి ఆయనతో పాటు భార్య రమాదేవిని కూడా ఈ కేసులో విచారణకు రావాలని సెక్షన్ 41ఎ నోటీసులు పంపింది. వీరిద్దరితో పాటు రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ కు, నారాయణ సంస్ధల ఉద్యోగి ప్రమీలకు కూడా సీఐడీ నోటీసులు పంపింది.
రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసిన బాగోతం బట్టబయలైంది. సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్స్పెర’ అనే షెల్ కంపెనీని కున్నటు తేలింది. ఈ నేపధ్యంలోనే.. నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.