1.పింఛన్ల పంపిణీకి 1,754 కోట్లు విడుదల..
తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులు పంపిణీ చేస్తున్నారని బూడి ముత్యాలనాయుడు వెల్లడి.
2.ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం వైఎస్సార్సీపీదే..
ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో 18 మందికి గాను 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్న వైవి సుబ్బారెడ్డి
3. పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూదందా.. 50 కోట్ల సాగుభూమి స్వాహాకు స్కెచ్..
ప్రభుత్వం దిశానిర్దేశంతో అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు
4.మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుంది..
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో వాసిరెడ్డి పద్మ వ్యాఖ్య.
5.మహిళల భద్రతకు భరోసా చంద్రబాబుతోనే సాధ్యం..
రజకులను ఎస్సీల్లో చేర్చడానికి టీడీపీ గతంలో కమిటీ వేసిందని నారా లోకేష్ వెల్లడి.
6.జగన్ 175 స్థానాల గురించి మాట్లాడుతున్నారు… కనీసం ఒక్క స్థానంలో అయినా మీతో కలిసి నడిచే పార్టీ ఉందా?
ఆర్థిక నేరస్తుడు జగన్ తో ఎవరు పొత్తు పెట్టుకుంటారు? సోమిరెడ్డి కౌంటర్.
7.ప్రపంచ టాప్-6 భవిష్యత్ నగరాల జాబితాలో అమరావతి..
హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు.. అమరావతి భారత్ ను గర్వించేలా చేస్తుందని ధీమా
8.ఏపీ సీఎస్ ను కలిసి ఉద్యమ నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంఘం నేతలు
మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ.
9.వైఎస్సార్ రైతు భరోసా అని తాటికాయ అంత అక్షరాలతో ప్రచారం చేస్తున్నారు..
పీఎం కిసాన్ అని ఇంగ్లీషులో చిన్న అక్షరాలతో రాయడం వెనుక ఆంతర్యం ఏంటని జగన్ సర్కారుకు రఘురామ ప్రశ్న.
10.చెట్టు కిందైనా ఉంటాం తప్ప.. వైసీపీ ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పం..!
శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పకపోతే ఇల్లు కూల్చేస్తామని బెదిరిస్తున్నారని లోకేశ్ ఎదుట ఓ మహిళా ఆవేదన.