జగన్ పధకాలకు జై కొట్టిన లోకేశ్

1.ఇకపై ఆనారోగ్యంపై ఆందోళన వద్దు..నేరుగా మీ ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ వస్తారు..
ఈనెల 15 తరువాత పూర్తిస్థాయిలో ప్రారంభం.

2.స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక మలుపు..
సీమెన్స్ కంపెనీతో ప్రాజెక్టు పేరిట ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కేసులో అప్పట్లో ఏపీ ఎస్ఎస్ఓసీ ఎండీ శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు.

3.పవన్ కు అంబానీ వంటి వాళ్లు అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా?..
వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్, లోకేశ్ ల పనిబడతామని వెల్లంపల్లి హెచ్చరిక

4.‘జగనన్న విద్యాదీవెన’ మరోమారు వాయిదా..
మళ్లీ నిధులను ఎప్పుడు విడుదల చేస్తారో వెల్లడించని ఏపీ సర్కార్.

5.స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ మంత్రి నారాయణకు మరో షాక్..
ఆయన కూతురు, అల్లుడికి సీఐడీ నోటీసులు!

6.జనసేనకు 20 లక్షల మంది ఫాలోవర్లు…
జనసేన సోషల్ మీడియా సైనికులకు పవన్ కల్యాణ్ అభినందనలు.

7.ఇసుక నుంచి తైలం తీయడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతింది..
జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారని దేవినేని ఉమ విమర్శ

8.మేం గెలిచినా సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తాం..
ఏ ప్రభుత్వం అయినా ఒప్పందాలు జరిగినప్పుడు వాటిని బహిరంగంగా అధికారికంగా ప్రకటిస్తారు అంటూ నారా లోకేశ్ వెల్లడి.

9.సీపీఎస్‌కు ప్రత్యామ్నాయం ఓపీఎస్‌ మాత్రమే
ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌ స్పష్టం.

10.రేపటి నుంచి ఉద్యోగుల ఉద్యమం..
నేడు సీఎస్ తో సమావేశం..