ఆ రెండు వైసీపీ ఖాతాలోకే..తేల్చేసిన సర్వే రిపోర్ట్

ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. అధికార మరియు ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ తిరిగి అధికారం పై ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక టిడిపి మాత్రం అధికారం కోసం ఉన్న అన్ని అవకాశాలను వాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్న వారిలో గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోను రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారు. అలాగే కొడాలి నాని రెండుసార్లు టీడీపీ నుంచి, రెండుసార్లు వైసీపీ నుంచి గుడివాడకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈ సారి ఎన్నికల్లో వీరిద్దరిని ఎలాగైనా ఓడించాలని టీడీపీ పట్టుదలతో ఉంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలలో ఇంకా టీడీపీ అభ్యర్ధులు ఖరారు అవ్వలేదు. అభ్యర్ధులను ఖరారు చేయడానికి బాబు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఎవరు విజయం సాధిస్తారు అన్న దానిపై ఆత్మసాక్షి నిర్వహించిన సర్వే క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి అధికారం చేపడతారని సర్వే ఫలితాలు తేల్చే చెప్పింది. ఈ సర్వేతో బాబు ఆసహలు ఆవిరి అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా కొడాలి నాని చంద్రబాబుకి ఓ సవాల్ కూడా చేశారు. సూర్యుడు పశ్చిమాన ఉదాయించినా తన గెలుపును ఎవ్వరూ అప్పలేరని, దమ్ముంటే గుడివాడ, గన్నవరం నియోజగవర్గాలలో బాబు, లోకేష్ లను పోటీ చేయమని సవాల్ చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు స్థానికంగా గట్టి పట్టుండటంతోనే వీరికి గెలుపు సాధ్యమవుతోందని స్పష్టమవుతోంది.