లోకేష్ పై కేసు నమోదు, పాదయాత్ర తుస్..!

నారా లోకేష్ కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. నారా లోకేష్ పాదయాత్రకు అనుమతికి ముందే కొన్ని కండీషన్ లను విధించిన సంగతి తెలిసిందే. నిబంధనలను ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ సర్కారు వారు ముందుగానే హెచ్చరికలు కూడా జారీ చేశారు. డానికి ఒకే చెప్పి లోకేష్ పాదయాత్రకు అనుమతి పొందారు. ఈ క్రమంలోనే.. ఏపీ పోలీసు శాఖ వారు విధించిన నిబంధనలను లోకేష్ క్రాస్ చేశారు. ఈ నేపధ్యంలోనే లోకేష్ తో సహా మరో ఆరుగురు టిడిపి కార్యకర్తలపై కేసు నమోదైంది. పలమనేరు సీఐ అశోక్కుమార్ ఫిర్యాదు చేశారు.

బంగారుపాలెంలో నడిరోడ్డుపై లోకేష్ ప్రసంగించే యత్నం చేశారు. అభ్యంతరం తెలిపిన పోలీసులను టీడీపీ కార్యకర్తలు దూషించారు. నడిరోడ్డుపై ప్రసంగాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులకు రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అనుమతి తీసుకోకుండా సభలు నిర్వహించకూడదని పోలీసులు సూచించారు. పోలీసులు సర్దిచెబుతున్నా టీడీపీ నేతలు గొడవకు దిగారు. వారి మంచికోసం చూస్తే.. వారు మాత్రం తమను అవమాన పరచారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న బంగారుపాళ్యం బహిరంగ సభలో పోలీసులు మూడు వాహనాలను సీజ్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, హత్యయత్నానికి పాల్పడ్డారంటూ పలువురు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అయితే మూడు వాహనాలు సీజ్ చేయడంతో ఇవాళ ప్రచారం ఎలా కొనసాగించాలన్న ఏర్పట్లలో టీడీపీ ఉంది.