ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీకి సింగపూర్ లాంటి రాజధానిని కడతానని చెప్పి.. రాష్ట్ర ప్రజల మొహంలో చిరునవ్వులు పుయిస్తానం చెప్పిన బాబు.. ఆఖరికి ఆయన 5 ఏళ్ళ పాలనలో ప్రజలకు గ్రాఫిక్స్ చూపించి రాజధానిని తాత్కాలికం చేశాడు. సంవత్సరంలో మూడు పంటలు పండే బంగారు భూములు. తెలుగుదేశం ప్రభుత్వం భూములను లాక్కుంది. దాదాపు 33000 వేల ఎకరాల భూమిని ప్రజల నుండి లాక్కున్నారు. అమరావతి అద్భుతంగా కడతామని, సింగపూర్ తరహా నగరంగా మారుస్తామని, ప్రపంచంలోనే అత్యంత గొప్ప నగరాలుగా తీర్చిదిద్దుతాం అని కోతలు కోశారు . ఐదేళ్లు కాలయాపన చేశారు. సినిమా వాళ్ళను ఇతర దేశాల్లో ఇంజనీర్లను పిలిచి ఆకృతులు తయారు చెయ్యమని కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ చేసింది శూన్యం. ఈ క్రమంలోనే అమరావతిలో భూకబ్జా అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తోంది. చంద్రబాబు హయాంలో అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారని నిన్నటి అసెంబ్లీ సమావేశంలో స్వయంగా సిఎం జగనే చెప్పుకొచ్చారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారని కూడా సిఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ‘అమరావతిలో భవన నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తే ఈ అవినీతి బండారం బయట పడింది. అందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది’ అని తెలిపారు. అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణానికి చ.అడుగుకు 12 వేలు చొప్పున దోచి పెట్టారని కూడా ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు తమను బెదిరించడంతోనే ఆయన చెప్పిన బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారని,, దీనిపై బాబు ఏమని సమాధానమిస్తారని బాబు ప్రశ్నించారు. ఈ దోపిడీల్లో ఈనాడు రామోజీ కుమారుడు కిరణ్ వియ్యంకుడు ఆర్వీఆర్ రఘు చౌధరి, నారా లోకేశ్ పీఏ కిలారి రాజేశ్ చౌధరి, చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ చౌధరి కీలక పాత్ర పోషించారని చాలా స్పష్టంగా సిఎం జగన్ వెల్లడించారు. వాటన్నింటి ఆధారంగానే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు పంపారని కూడా వివరించారు.
దాంతోనే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో 371 కోట్లు అందాయి. చంద్రబాబు తమను బెదిరించడంతోనే ఆయన చెప్పిన బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. మరో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి తామే నిధులు వసూలు చేసి, చంద్రబాబుకు అందించామని చెప్పారు. ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. మరి అమరావతి భూకుంబకోణంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.