1, 1, 1, 2, 2,2, 3, 3, ఈ యాడ్లు విని చాలా కాలం అయి ఉంటుంది. ఫలితాలు విడుదల అయ్యాయ౦టే చాలు..కార్పొరేట్ స్కూల్ యాడ్లు ఓ రేంజ్ లో మోత మొగుతాయి. కానీ ఇప్పుడు ఆ యాడ్లకు చెక్ పడింది. గత ప్రభుత్వంలో కేవలం కార్పొరేట్ స్కూల్స్ లో మాత్రమే వినిపించే ఈ 1, 1, 1, 2, 2,2, 3, 3, యాడ్లు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో వినిపిస్తున్నాయి. నాడు ఒక లెక్క నేడు ఒక్క.. అన్న మాదిరి.. గత ప్రభుత్వం కేవలం కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రమే సపోర్ట్ చేసేది. కానీ నేటి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గ విద్యార్ధుల జీవితాల గురించి ఆలోచించి.. బట్టీ బట్టే కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా.. ఉన్నాయి నేటి ప్రభుత్వ పాఠశాలల పదవ తరగతి ఫలితాలు. రాష్ట్రంలో అభివృద్ది ఎక్కడ అని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకి ఇది సరైన జవాబు. బాగా విను బాబు. ప్రభుత్వ స్కూల్ కి చెందిన విద్యార్ధి స్టేట్ టాపర్ గా నిలిచింది అంటే రాష్ట్ర అభివృద్ది కాదా చంద్రబాబు..? టెన్త్ లో తిరుగులేని ఫలితాలు సాధించడం రాష్ట్ర అభివృద్ది కాదా చంద్రబాబు..? అసలు నీ హయాంలో ఇలాంటి ఫలితాలు ఎప్పుడైనా వచ్చాయా బాబు..? రావు.. ఎందుకొస్తాయ్. ఏనాడైనా ప్రభుత్వ స్కూల్స్ గురించి పట్టించుకున్నావా..? పేద విద్యార్ధుల భవిష్యత్ గిరించి ఆలోచించావా..? విద్యార్ధుల ఆరోగ్యంపై శ్రద్ద తీసుకున్నావా..? నారాయణ లాంటి కార్పొరేట్ స్కూల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి… ప్రైవేట్ పాఠశాలలను ఒక బిజినెస్ గా మార్చి డబ్బులు దోచేసుకున్నారు. కానీ నేడు విద్యార్ధులపై సిఎం జగన్ చూపిన శ్రద్ద, భాద్యత ఈ తిరుగులేని ఫలితాలకు కారణం అని చెప్పాలి. డైనమిక్ సీఎం-డైనమిక్ రిజల్ట్స్ అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి.
ఒకప్పుడు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే ఎంత భయం ఉండేది. విద్యార్థులే కాదు.. అధ్యాపకులు, తల్లిదండ్రుల్లో ఇంగ్లిష్ అంటే ఒకరకమైన భయం ఉండేది. అమ్మో ఇంగ్లీష్ మీడియం అంటే.. పెద్ద చదువులు, అంత పెద్ద చదువులు మనకు ఎక్కడ అబ్బుతాయని.. పేద ప్రజలకు భయం. దీంతో ఏటా టెన్త్ ఫలితాల్లో ఇంగ్లిష్ తప్పినవాళ్ళే ఎక్కువగా ఉండేవారు. ఆ భయాన్ని పోగొట్టేందుకు సిఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి సారించారు. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం , పిల్లలకు సైతం ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో ఇంగ్లిష్ లో ఫెయిల్ అయినా వారు గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. అంటే ఇక ముందు మన పిల్లలకు ఇంగ్లిష్ అంటే భయం పోయినట్టే.. ఇక నాడు- నేడు పేరిట రాష్ట్రంలోని పాఠశాలల ముఖచిత్రాన్ని మార్చేసిన సిఎం జగన్.. ప్రభుత్వ స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు, పిల్లల సౌకర్యార్థం చక్కని బెంచీలు, డిజిటల్ బోర్డులతోబాటు పుష్టికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నందన వనాల్లా తీర్చిదిద్దారు. జగనన్న విద్యాకానుక కిట్ లో భాగంగా పిల్లలకు, నోట్ పుస్తకాలూ.. బూట్లు, బ్యాగ్ , స్టేషనరీ ..పెన్నులు పెన్సిళ్లు అందిస్తూ పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఇక అమ్మఒడి పథకం అనేది మొత్తం దేశంలోనే ఓ సంచలనమైంది. దీంతో ఇన్నాళ్లూ కార్పొరేట్ స్కూళ్లలో చదివిన పిల్లలు సైతం వచ్చి ప్రభుత్వ స్కూళ్లలో చేరారు. దీంతో గత రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో ఎన్రోల్మెంట్స్ కూడా పెరిగాయి.
ఈ ఏడాది టెన్త్ క్లాస్ లో 72.26 శాతం ఫలితాలు సాధించారు. బాలికల్లో 75.38 %, మంది ఉత్తీర్ణులు కాగా బాలురు 69.27% మంది పాసయ్యారు.
అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కాకినాడ జిల్లా పీ.వెంకటాపురం విద్యార్థిని దడాల జ్యోత్స్న 10వ తరగతి పరీక్షలలో అత్యంత ప్రతిభను కనబరిచి 589/600 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఇంతే కాదు.. ఇలాంటి ఆణిముత్యాలు ఏపీలో కోకొల్లలు ఉన్నారు. గతంలో
ఇంగ్లీష్ అంటే భయం ఉన్న విధ్యార్ధులు.. అదే ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడుతున్నారు అంటే అది సిఎం జగన్ చూపిన చొరవ అనే చెప్పాలి.