జగన్ కి జై కొట్టిన టిడిపి సీనియర్ నాయకుడు

వచ్చే ఎన్నికల యుద్దానికి రాజకీయ నాయకులు సిద్దం అవుతున్నారు. ఏపీలో వలసల పర్వం కొనసాగుతు౦ది. ఇప్పటి వరకు పార్టీలో కష్టపడి పని చేసి.. తగిన ఫలితం దక్కని వారందరూ.. వైసీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది సిఎం జగన్ సమక్ష౦లో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకి మరో షాక్ తగిలింది. రామచంద్రాపురంలో టిడిపి సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి వైసిపిలో చేరారు. ఈయనను మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

అంతేకాదు ప్రకాష్ రెడ్డితో పాటు మరో 200 మంది టిడిపి కార్యకర్తలు వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీలకు అతీతంగా పనిచేయడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించడం, సిఎం జగన్ పాలనను మెచ్చి వైసీపీలో చేరామని ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఎంతోకాలంగా టిడిపి కోసం కష్టపడి పని చేసినప్పటికీ.. పార్టీలో తగిన గుర్తింపు లభించట్లేదని .. టిడిపి సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ కండువా కప్పుకున్నారు. సిఎం జగన్ అమలు చేస్తున్న అన్ని పధకాలకు మెము కూడా పొందుకుంటున్నాం అంటూ మహిళలు సిఎం జగన్ ను కొనియాడారు. జగన్ ప్రభుత్వం మహిళల భద్రతకు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారని తమ అభిప్రాయ వ్యక్తం చేశారు.