టీడీపీ నేత పట్టాభి ఆడిన నాటకం మరోమారు బయటపడింది. పోలీస్ స్టేషన్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి జడ్జికి తెలిపారు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేసరికి స్టాఫ్ ఎవరూ లేరని చెప్పారు. ముసుగు వేసుకుని ముగ్గురు వ్యక్తులు పీఎస్‌కు వచ్చి.. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని జడ్జీకి వివరించారు. అంతేకాకుండా అరికాళ్లు, అరిచేతులపై తీవ్రంగా కొట్టారని చెప్పారు. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అసలు పట్టాభి చేతిపై దెబ్బలు లేవని.. వైద్య పరీక్షలలో తేలింది. ఈ మేరకు విజయవాడ జీజీ హెచ్ వైద్యులు రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఎడమచేతి మణికట్టు పై కొద్దిగా వాపు ఉందని వైద్యులు తెలిపారు. పట్టాభికి నిర్వహించిన రిపోర్ట్ ను పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచారు. కాగా పట్టాభిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో మారికాసేపట్లో పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.