పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే షాక్ వైసీపీలోకి సీనియర్ నేత

తెలుగు రాష్ట్రాల్లో ఎలెక్షన్ గేమ్ షురూ అయ్యింది. లీడర్ల౦తా ఓటర్లని తమవైపు తిప్పుకొనేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరి స్టైల్ లో వాళ్ళు పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారు. వ్యూహ ప్రతి వ్యూహాలు, ఎత్తులకు పై ఎత్తులతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న సవాళ్ళతో ఎప్పటికప్పుడు ఏపీ రాజకీయాలలో హై ఓల్టేజ్ నెలకొంటోంది. ఏ పార్టీ నుంచి ఎవరి బరిలోకి దిగబోతున్నారు..? ఎవరెవరు పార్టీలు మారబోతున్నారు..? ఇలా ఎన్నో రకాల సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చి ఇప్పుడు వైసీపీలోకి వస్తున్న ఆ కీలక నేత ఎవరంటే.. ఒకప్పటి కాంగ్రెస్ నేత, ప్రస్తుతం జనసేన నేత.. ఆయనే యర్రం వెంకటేశ్వర రెడ్డి. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు విజయం సాధించిన నేత ఆయన. అయితే.. 2019 ఎన్నికలకు ముందు యర్రం వెంకటేశ్వర రెడ్డి జనసేన పార్టీలో చేరి.. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడవ స్థానాలో నిలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి అంబటి రాంబాబుని ఓడించాలని పవన్ కళ్యాణ్ గట్టి స్కెచ్ వేసి.. బలమైన అభ్యర్ధిని రంగంలోకి దింపినప్పటికీ.. పవన్ కళ్యాణ్ కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పుడు అదే నేత పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి చేరబోతున్నారు. నేడు ఆయన తాడేపల్లిలో నేరుగా సిఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకొనున్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే యర్రం వెంకటేశ్వర రెడ్డి నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్దికి ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి వైసీపీలోకి రావడం జగన్ కు ప్లస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే.. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వరరెడ్డినే బరిలోకిదించాలని పవన్ కళ్యాణ్ ఓ ప్రణాళికను కూడా సిద్దం చేసుకున్నారని ప్రచారం జరిగింది. అంబటి రాంబాబును ఓడించాలంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుతోపాటు గత ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న యర్రం వెంకటేశ్వరరెడ్డి సరైన వ్యక్తి అవుతారని పవన్ కళ్యాణ్ భావించారు. కానీ యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇప్పుడు వైసీపీ వైపు అడుగులు వేస్తుండటంతో సేనాని ఆశలు ఆవిరి అయినట్టేనని అంటున్నారు.. విశ్లేషకులు.