చంద్రబాబు తమ రాజకీయ భవిష్యత్ కోసం అష్టకస్టాలు పడుతుంటే.. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్ర౦.. బాబు పరువు తీసిపడేస్తున్నారు. అనునిత్యం చంద్రబాబు వెంటేసుకుని తిరిగే అచ్చెన్నాయుడే ఇలా చేయడం గమనార్హం. నాడు పార్టీ లేదు బొక్కా లేదు అంటూ.. చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో తెగ వైరల్ అయి.. చంద్రబాబు పరువును తీశారు. నేడు మళ్ళీ అలాంటి సీన్ ఒకటి రిపీట్ అయ్యింది. అది కూడా తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఓ ఆడియో లీక్ అయ్యింది. అందులో యాత్రకు సంబంధించి అంశాలపై అచ్చెన్న పార్టీ నేతతో చర్చించారు. ఈ ఆడియో వైరల్ కావడంతో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.
ఈ ఆడియో లీక్ చేసింది 100% అచ్చెంనాయుడే అని నాకు 1000% నమ్మకం.. ఎందుకంటే నారా లోకేష్ అసలు కెపాసిటీ ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకునేలా చేసి తెలుగు దేశం పార్టీని కాపాడాలని పన్నిన అచ్చెంనాయుడి వ్యూహం ఇది’అంటూ వర్మ ట్వీట్ చేశారు. అలాగే అచ్చెన్నాయుడు, పార్టీ నేత మాట్లాడుకున్న ఆడియో క్లిప్‌ను కూడా ట్వీట్‌కు జతపరిచారు. ‘అలాగే పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన నారా లోకేష్ ఒక టెర్రిఫిక్ ఐడియా చేయొచ్ఛు! చెస్ట్ నొప్పో ,లిగమెంట్ తెగిందనో చెప్పి, డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అని సర్టిఫికెట్ తీసుకొని.. పాద యాత్ర ఆపేస్తే తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది నా ఉచిత చచ్చు సలహా’అంటూ మరో ట్వీట్ చేశారు. నారా లోకేష్ పాదయాత్రలో చుట్టూ అన్ని లక్షలమంది ఉన్నారా.. తాను నమ్మలేకపోతున్నాను అంటూ మరో ట్వీట్లో ఎద్దేవా చేశారు.