వైసీపీలోకి అచ్చెన్నాయుడు పార్టీ లేదు-బొక్కా లేదు

ఆ నలుగురే కాదు.. ఇంకా 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తామని.. చెవులు గుయ్యిమనేలా ప్రతిరోజూ ఫోన్ కాల్స్ చేస్తున్నారని, వైసీపీకి చెందిన 40 మంది తమతో టచ్ లో ఉన్నారని.. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ వ్యాఖ్యలకు వైసీపీ ఓ రేంజ్ లో కౌంటర్ ఇస్తుంది. ఇక ఈ నేపధ్యంలోనే మినిస్టర్ రోజా అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 40 మంది వైసీపీ వాళ్ళు తనకు టచ్ లో ఉన్నారని అచ్చెన్నాయుడు అంటుంటే.. మా వాళ్ళు ఎందుకు టచ్ లో ఉన్నారు.. మీ పార్టీలో 175 నియోజకవర్గాలలో అభ్యర్ధులను కండక్ట్ చేయడానికి టచ్ లో ఉన్నారా..? లేక ఎలాగూ పార్టీ లేదు బొక్కా లేదు అన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎలాగో మూసేస్తారు వైసీపీలోకి రావాలంటే.. ఎవరైనా వచ్చి సిఎం జగన్ తో మాట్లాడాలని ప్రతి ఒక్కరికీ టచ్ లోకి అచ్చెన్నాయుడు వెళ్తున్నారని మంత్రి రోజా ప్రశ్నించారు. 175 స్థానాలలో క్యాండిడేట్ లను పెట్టడానికి.. టిడిపి కి గానీ, జనసేనకి గానీ దమ్ము ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు పొత్తులు పెట్టుకున్నా సరే.. 175 స్థానాలలో అభ్యర్ధులను బరిలోకి దించే సత్తా లేదని రోజా వ్యాఖ్యానించారు. తమ నాయకుడు సింగిల్ గా ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నారని రోజా స్పష్టం చేశారు. అలాంటిది మా వాళ్ళు టిడిపి కి టచ్ లో ఉన్నారని ప్రచారం చేయడం ఓ డ్రామా అని అన్నారు. ఇది కేవలం అచ్చెన్నాయుడు వైసీపీలోకి రావడం కోసమే.. సిఎం జగన్ ని కలవడానికే తమ ఎమ్మెల్యేలకు టచ్ లోకి వచ్చి.. ఆయన అడుక్కుంటున్నట్టు సమాచారం అందింది అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు క్లారిటీ కూడా ఇవ్వాలని రోజా పేర్కొన్నారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలోనే చంద్రబాబుకి ఎన్టీఆర్ గుర్తొస్తారని, బాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ లో కూడా ఎన్టీఆర్ ఫోటోలు లేకుండా బయట ఎత్తిపడేసిన సందర్భాలు ఉన్నాయని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ఎన్టీఆర్ మీద అంత ప్రేమ ఉంటే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు మీద ఎందుకు ఒక్క యూనివర్సిటీ కూడా కట్టలేదని చంద్రబాబు, లోకేష్ లను మంత్రి రోజా ప్రశ్నించారు.