1.మే 9న జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ప్రారంభం..
స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం అని సీఎం జగన్ వెల్లడి.
2.చంద్రబాబుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు లేదు..
బాబు షోలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అంటూ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.
3.వ్యవసాయం దండగ అని నేను అనలేదు….
వ్యవసాయంపైనే ఆధారపడితే పేదవారిగా మిగిలిపోతామని చెప్పినట్టు చంద్రబాబు వెల్లడి.
4.అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై తీర్పు జూన్ 5కి వాయిదా…
సీబీఐ తన పని తాను చేసుకోవచ్చన్న హైకోర్టు.
5.తడి గుడ్డతో గొంతు కోసే వ్యక్తి చంద్రబాబు..
గతంలో మోదీని తిట్టి ఇప్పుడు మోదీ విజన్ సూపర్ అంటున్నారని మంత్రి రోజా విమర్శ.
6.జగనన్న కోసం పని చేసిన కార్యకర్తలు బజారున పడ్డారు..
తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు.
7.మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపండి..
కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్..అధికారులకు కీలక ఆదేశాలు.
8.పరీక్ష తప్పితే ఏమవుతుంది… విద్యార్థులు ఆత్మహత్య ఆలోచన చేయొద్దు..
ఇంటర్ పరీక్షలలో ఫెయిల్ అయినందుకు 9 మంది విద్యార్థుల బలవన్మరణపై స్పందించిన లోకేష్.
9. కుప్పంలో మరింత వేడెక్కిన రాజకీయం..
8వ వార్డులో టీడీపీ నేత జగన్ ఇంటిపై అర్ధరాత్రి దాడి.
10.తల్లి, చెల్లి అంటే ప్రేమ లేదు.. ఓ బాబాయిని చంపించాడు.. మరో బాబాయిని జైలుకు పంపాడు..
యుగానికో రాక్షసుడు పుడతాడంటూ సిఎం జగన్ పై చంద్రబాబు సంచలన ఆరోపణలు.