అక్కినేని నాగచైతన్యను, అఖిల్ ను టార్గెట్ చేసి ట్రోల్

ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న నాలుగు కుటుంబాల కథ ఇది.

తరతరాలుగా కుటుంబానికి చెందిన సినీ పరిశ్రమ వారసత్వం, తండ్రి నుండి కొడుకు మరియు మనవళ్లకు వారసత్వంగా సమాజాన్ని ఆకర్షించింది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని ఫ్యామిలీని ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..

అక్కినేని ఫ్యామిలీ ఏం మాట్లాడిన తప్పే .. మాట్లాడకపోయినా తప్పే మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్యను అఖిల్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . రీసెంట్గా ధమాకా సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ కి చేరడంతో అక్కినేని హీరోస్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కినేని ఇంటిపేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే అక్కినేని ఫ్యామిలీలో మరో కొత్త ప్రాబ్లం వచ్చినట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది . ఇప్పటికే సమంతకు నాగచైతన్య విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే .

అంతే కాదు అక్కినేని అఖిల్ కూడా నిశ్చితార్ధం చేసుకొని అమ్మాయితో బ్రేకప్ చెప్పేసుకున్నాడు . కాగా ఇద్దరికీ రెండో పెళ్లి చేయడానికి నాగార్జున రెడీగా ఉన్నారట. అంతేకాదు నాగ చైతన్య రెండో భార్యను కూడా సెలెక్ట్ చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అమల మాత్రం అఖిల్ ని మళ్లీ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తోందని, అయితే అఖిల్ ఒప్పుకోవడం లేదని అంటున్నారు. ఈ క్రమంలో అఖిల్ పెళ్లికి ఒప్పుకుంటేనే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవాలని అక్కినేనికి ఓ క్రేజీ కండిషన్ పెట్టిందట అమల..

దీంతో ఒక్కసారిగా అక్కినేని కాంపౌండ్ లో తగాదాలు మొదలయ్యాయి . ఈ క్రమంలోనే నాగర్జున, అక్కినేని అఖిల్ ని పెళ్ళికి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట . అయితే అఖిల్ అక్కినేని మాత్రం పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు అంటూ తేల్చి చెప్పేసాడట . దీంతో నాగచైతన్య రెండో పెళ్లి ప్రశ్నార్థకంగా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అక్కినేని ఫ్యామిలీను కొంతమంది జనాలు సింపతిగా చూస్తున్నారు.