1.తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన సిక్కు మత పెద్దలు..
సిక్కుల కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్.
2. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు..
వారిని సురక్షితంగా ఏపీ ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తోందని ఎంపీ భరత్ వెల్లడి.
3.ఆర్-5 జోన్‌పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రైతులు..
వచ్చేవారం విచారణ చేపడతామన్న సీజేఐ బెంచ్..
4.జైలులోకి నాలుగు కత్తులు ఎలా వచ్చాయి?.
తీహార్ జైలు అధికారులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
5.తెలంగాణలో టీడీపీ సత్తా చాటుతుంది..
సికింద్రాబాద్ లో నిర్వహించిన మినీ మహానాడుకు హాజరైన బాలకృష్ణ వ్యాఖ్యలు.
6.లోకేష్ పాదయాత్రకు ఎదురెళ్ళిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ..
ఆరోపణల్ని నిరూపించాలని సవాల్.
7.రైతుల కన్నీళ్లు పట్టని అభినవ నీరో చక్రవర్తి జగన్..
ఉచిత పంటల బీమా పేరుతో జగన్ ప్రభుత్వం రైతుల్ని కష్టకాలంలో దిక్కులేని వాళ్లని చేసిందని ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆగ్రహం.
8. ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ బతుకులతో రాజకీయ లబ్దిపొందుతున్నారు..
టిడిపి హయాంలో ఇచ్చిన షాదీ తోఫా ఫోటోలనే జగన్ రెడ్డి పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని కొల్లు రవీంద్ర విమర్శ.
9.ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ నిరాకరణ
ఆయన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయమూర్తి.
10.ఓ హిందీ సినిమా.. అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. ఇదీ పాన్ ఇండియా సినిమా అంటే..
‘ది కేరళ స్టోరీ’పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్