అధికారం ముసుగులో, అమరావతి రాజధాని పేరు చెప్పుకొని చంద్రబాబు సాగించిన అవినీతి, అక్రమాలు ఒక్కొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ అంశంపై రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు మలుపులో బాబు & కో అవినీతి గుట్టు రట్టవుతోంది.
అమరావతి పేరు చెప్పి బాబు అందిన కాడికి దోచేశారని బాబు అండ్ కో పై వైసీపీ ఓ రేంజ్ లో నిప్పులు చేరుగుతోంది. అమరావతి భూదందాలో లింగమనేని రమేష్, నారాయణ మెయిన్ రోల్ గా వ్యవహరించారు. ఈ అవినీతి పాపంలో పవన్ కల్యాణ్ కు కూడా చంద్రబాబు పిడికెడు వాటా ఇచ్చారని ప్రచారం సాగుతోంది. కాజాకు సమీపంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కు సమీపంలోనే పవన్ కల్యాణ్ కు 2 ఎకరాల భూమి ఉందని ప్రచారం జరుగుతోంది. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా 8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చెప్తున్నారు. నీతి మాటలు చెప్తున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడటం ఏంటని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఇదంతా చంద్రబాబు మైండ్ గేమ్ పాలిటిక్స్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఓ పథకం ప్రకారమే ఈ స్కామ్ లో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఇరికించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయంగా తనను విడిచి పవన్ బయటకు వెళ్లకుండా చంద్రబాబు పక్కా స్కెచ్ వేశారని, ఈ రకంగా పవన్ జుట్టు బాబు చేతిలో ఉందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ బాబు చెప్పిందల్లా చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అవినీతి పాపంలో పవన్ కళ్యాణ్ కి కూడా వాటా ఉందని వస్తోన్న వార్తలపై పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది చూడాలి. అసలు
రియాక్ట్ అవుతారా లేక సైలెంట్ గా ఉండి.. ఈ ఆరోపణల్ని నిజం చేస్తారో అన్నది కూడా చూడాలి.