నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకి మించిన వారు లేరని అంతా అంటుంటారు. మరి ఆయన అడుగుజాడల్లో నడిచే వారికి కూడా ఈ జబ్బు ఎలా సోకాకుండా ఉంటుంది అని కూడా అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. వెన్నుపోటుకే వెన్నుపోటు పొడవడం అంటే ఏంటో మరోసారి ఋజువయ్యింది. ఏంటి రాధాకృష్ణ ఏంటి చంద్రబాబుకి వెన్నుపోటు పొడవడం ఏంటి అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది వింటున్నది అక్షరాలా నిజం. పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబుకి ఏబీఎన్ రాధాకృష్ణ కలం పోటు పొడిచారని అంటున్నారు. సిఎం కేఎసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్ ఇచ్చారని ఆయనకు సంబందించిన పత్రికలోనే ప్రింట్ అయ్యింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చుతున్నారు. ఇన్నాళ్లు టీడీపీ, జనసేన కలిసి 2024 ఎన్నికలకు వెళ్తాయని అందరూ అనుకున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం పవన్ కల్యాణ్ కి వెయ్యి కోట్లు ఆఫర్ అంటూ ఆంధ్రజ్యోతి పేపర్‌లో విశ్లేషణ వచ్చింది. అయితే ఈ వార్తపై పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించకపోవడం పలు రకాల చర్చలకు దారి తీస్తుంది. సీఎం జగన్‌కు సహాయపడటానికి ప్రణాళికలు రచిస్తున్నారని, రాజకీయపరంగా చంద్రబాబు అంటే గిట్టని కేసీఆర్.. బాబును అధికారంలోకి రాకుండా చూడాలని భావిస్తున్నారని, అందుకే తన బీఆర్‌ఎస్ పార్టీలో కాపులకు స్థానం కల్పించి.. ప్రజా వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారని, జనసేన-టీడీపీ పొత్తును కూడా అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇందుకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారని ఓ కధనం ప్రచారం అవుతోంది. ఈ కధనం ఏ పత్రికల్లోనూ రాలేదు కేవలం ఒక్కగానొక్క ప్రముఖ పత్రికలోనే వచ్చింది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏమని స్పందిస్తారో చూడాలి.