నోరుజారిన ఆణిముత్యం ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయిన లోకేష్

ఆయన మాట్లాడే తెలుగుపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడతాయి. బహిరంగ సభల్లో మాట్లాడుతూ.. పొరపాటున తమ పార్టీని తిట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. నేటి రాజకీయాలలో ఆయన ఓ కామిడీ పీస్. ఆయనెవరో ఇప్పటికే అర్ధమయ్యే ఉండాలి. ఆయనే నారా లోకేష్. తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోయాయి. ఆ వీడియోలను నెట్టింట షేర్ చేసి.. ట్రోల్స్ కూడా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టి 60 రోజులు దాటినప్పటికీ.. లోకేష్ కి ఇంకా విషయ పరిజ్ఞానం రానట్టుంది. అందుకే ఏది పడితే అది మాట్లాడి.. నలుగురిలో పరువు పోగొట్టుకుంటున్నారు. అసలు లోకేష్ ఏమన్నాడో ఈ వీడియో వినేయండి.. మీకే అర్ధం అవుతుంది.

ఓరినాయన… ఏందయ్యా ఇది నేనెప్పుడూ వినాలా…దామోదరం సంజీవయ్య గారు, నీలం సంజీవరెడ్డి గారు SK యూనివర్సిటీ లో చదివారా. ఏమి సెపితివి ఏమి సెపితివి .. మొదటి నుంచీ ఇంతేనా… ఈ మధ్యనే ఇలా అయ్యావా .. SK యూనివర్సిటీ పెట్టింది 1981 లో అంటే అప్పటికి ఇంకా నువ్వు పుట్టలేదురా నాయనా… దామోదరం సంజీవయ్య 1960-1962 మధ్యలో ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి 1977 –1982 మధ్యలో మన దేశానికి రాష్ట్రపతిగా సేవలు అందించారు… అప్పటికి మీ నాయనే బచ్చాగాడు. కానీ నువ్వేమో దామోదరం సంజీవయ్య గారు, నీలం సంజీవరెడ్డి గారు SK యూనివర్సిటీలో చదివారని చెప్తున్నావు. ఓరినాయన ఇంకా నయం నీతో కలసి చదువుకున్నారు అనో.. లేక మీ నాయనతో కలసి కాఫీ తాగారనో చెప్పలా. తండ్రికి తగ్గ కొడుకువి అనిపించుకున్నావులే. మీ నాయన ఏమో software నేనే కనిపెట్టా.. బిల్గేట్స్ కి విండోస్ అని పేరుపెట్టమని చెప్పా, సుందర్ పిచ్చయిని నేను గూగుల్ సీఈఓ చేశా, ఇండియా కి ట్రంప్ ని నేనే తీసుకొచ్చా అని చెప్పుకుంటాడు. నువ్వు ఏమో మా ప్రభుత్వం లో బర్రె పాలు ఎక్కువ ఇచ్చింది.. వైసీపీ ప్రభుత్వంలో పాలు తక్కువ ఇస్తుంది…నీలం సంజీవరెడ్డి SK యూనివర్సిటీ లో చదివారు.. అని చెప్పుకొని తిరుగుతావుండు.

దీనెమ్మ జీవితం కరోనా ప్రపంచానికి నష్టం చేసింది కానీ మంచి చేసి ఉంటే కరోనాని తయారు చేయమని చైనా కి మేమే చెప్పాము అని చెప్పుకునే వాళ్ళు రా నాయనా మీ అబ్బా కొడుకులు.. ఏమి బుర్రలురా బాబు మీవి. బయటకు వచ్చేటప్పుడు బుర్రలు ఫ్రిడ్జ్ లో పెట్టివస్తారేంట్రా బాబు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడతారు. అదేదో సినిమాలో సర్వేపల్లి రాధాకృష్ణ గారిది, మాది ఒకే ఊరు.. ఏ ఊరు అంటే సర్వేపల్లి అన్నట్లు ఉంది మీరు చెప్పేది. ఇంకా నయం గాంధీ గారు మేము ఒకే కుటుంబం.. ఆయనా జైలుకి వెళ్ళాడు మేము జైలుకి వెళ్ళాము అని చెప్పుకోడంలేదు సంతోషంరా బాబు…