జనసేనకు మరో షాక్ రాష్ట్ర ప్రజలే సమాధి కడతారు తెరపైకి హెరిటేజ్ అక్రమాలు

1.ప్రజలకు వలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నెడ్ వారికి అవార్డుల అందజేత..
విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సిఎం జగన్.

2.’రాష్ట్ర ప్రజలే చంద్రబాబుకు, టీడీపీకి సమాధి కడతారు’..
అయ్యన్నపాత్రుడు ఇచ్చిన గంజాయి తాగి చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఫైర్.

3. ఆరోగ్య శ్రీ సేవల యథాతధంగా కొనసాగుతాయి..
పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ స్పష్టం.

4.కర్నూలు విజయ డెయిరీలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమే..
మీ హెరిటేజ్ కారణంగా ఎన్ని డెయిరీలు మూతబడ్డాయో తెలుసుకో లోకేష్ అంటూ.. విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి ఫైర్.

5. జనసేనకు ఈసీ షాక్..
ఫ్రీ సింబల్ జాబితాలోకి జనసేన ‘గాజు గ్లాసు’..

6.హైదరాబాద్‌లో ఈ నెల 20న ఎన్టీఆర్ శత జయంతి సభ..
సభకు హాజరు కానున్న అగ్రశ్రేణి సినీతారలు, రాజకీయ ప్రముఖులు.

7.ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారు..
మంగళగిరి రోడ్డు ఏఎస్ ఫంక్షన్ హాల్ పక్కన ఈ నెల 21వ తేదీన తోట చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.

8.అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన దుర్ఘటన జరిగి నేటితో 18 నెలలవుతుంది..
ప్రాజెక్టు నిర్మాణం పూర్తి దేవుడికి ఎరుకని.. సీఎం జగన్ పై ట్విటర్ వేదికగా పవన్ కల్యాణ్ విమర్శలు

9.భారత్‌లో 8 కొత్త నగరాల ఏర్పాటు దిశగా కేంద్రం
ఈ మేరకు 26 నగరాల ఏర్పాటుకు రాష్ట్రాల ప్రతిపాదనలు

10.అనంతలో 200 కోట్లు విలువగల మిస్సమ్మ కాంపౌండ్ స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడండి ..
సిఎం జగన్‌కు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ లేఖ.