టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన పోలీసుల కళ్లుగప్పి చెన్నై వెళ్లిపోయారని
తెలుస్తోంది. తన అనుచరుల సహాయంతో ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్ ను ధ్వంసం చేశారని, ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా
నమోదు చేశారట ఈ కుసులో దాదాపు 32 మందిని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే..ఈ ఘటన అనంతరం ఆయన
హైదరాబాద్ కు చేరుకుని తన రాజకీయ గురువును ఆశ్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ రాజకీయ గురువు బీజేపీ నేత అని.. ఆయనకు
ప్రత్యేక విమానం కూడా ఉందని అంటున్నారు. ఆ ప్రత్యేక విమానంలోనే బీటెక్ రవి చెన్నైకు పరారయ్యారని పేర్కొంటున్నారు. అసలు ఇంత చిన్న
కేసులో పరార్ అవ్వాల్సిన అవసరం ఎమొచ్చింది..? అంతేనా దీని వెనుక ఇంకేమైనా కుట్ర దాగి ఉందా..? లేదంటే వివేకా కేసుకు సంబందించి
పరార్ అయ్యారా..? అసలు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు పరార్ అవ్వాలి..? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు పలు రకాల చర్చలకు దారి
తీస్తున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అని చెబుతున్నారు. చక్రాయపేటలో రియల్ ఎస్టేట్ వెంచర్ ను ధ్వంసం చేశాక బీటెక్ రవి..
ఎంపీ సీఎం రమేష్ ను ఆశ్రయించారని అంటున్నారు.ఆయన తన సహాయకులు ఎం.రవీందర్ పి.శ్రీనివాసరావు అనే వ్యక్తుల ద్వారా బీటెక్ రవిని
ప్రత్యేక విమానంలో చెన్నైకు పంపారని టాక్ నడుస్తోంది. అయితే పోలీసులు గుర్తించకుండా ఉండేందుకే బీటెక్ రవి తన పేరును ఎం.రవీందర్గా పేరు
మార్చుకున్నట్లు సమాచారం.
మరోవైపు కొద్ది రోజుల క్రితం బీటెక్ రవి ఒక ప్రముఖ టీవీ చానల్ అధినేతకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వివేకా హత్య గురించి సంచలన
విషయాలు చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపైన హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం బీటెక్ రవిని
టార్గెట్ చేసిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయన చేయని తప్పుకు ఆయనను కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తుందనే
విమర్శలు వస్తున్నాయి.