గాజువాకలో పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ కోలుకోలేని దెబ్బకొట్టిన జనసైనికులు వివేకా కేసులో మరో ట్విస్ట్

1.పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తావా చంద్రబాబు..
అమరావతిలో పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని బందరు సభలో సీఎం జగన్ ఫైర్.

2.పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు..
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి ఇచ్చారా?’ అని ప్రశ్నించిన పేర్ని నాని.

3.వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్ ..
ముందస్తు బెయిల్ కోసం మరోసారి సుప్రీంను ఆశ్రయించిన అవినాష్ రెడ్డి..

4.అవినాష్ విషయంలో సీబీఐ ముందడుగు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది..
వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి సంచలన కామెంట్స్.

5.బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయను.. వాళ్లు మంచి పని చేస్తున్నారనే మాట్లాడా..
వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించడంపై ఎంపీ కేశినేని నాని వివరణ.

6.రాయలసీమ కథకు చిరునామా కేత విశ్వనాథరెడ్డి గుండెపోటుతో కన్నుమూత..
ఆయన మృతికి సంతాపం ప్రకటించిన సిఎం జగన్..

7.గాజువాకలో పవన్ కళ్యాణ్ కి భారీ షాక్…
వైఎస్సార్సీపీలో చేరిన 500 మంది జనసేన కార్యకర్తలు.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.

8.తమ్ముడు అరెస్ట్ కాకుండా అడ్డుపడటం వెనకున్న రహస్యం ఏమిటో జగన్ బయటపెట్టాలి..
అవినాశ్ అరెస్ట్ కాకుండా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారన్న చింతకాయల విజయ్.

9.తిరుమల కొండపై వైసీపీ జెండాతో జీపు తిరుగుతుంటే విజిలెన్స్ సిబ్బంది ఏంచేస్తున్నారు?..
పుణ్యక్షేత్రాన్ని రాజకీయ వేదికగా మార్చేశారని అచ్చెన్నాయుడు విమర్శలు.

10.చంద్రబాబు ప్రారంభించినవే జగన్ మళ్లీ చేయడం ఎన్నికల జిమ్మిక్కులో భాగమే..
బందర్ పోర్ట్, భావనపాడు పోర్ట్, భోగాపురం విమానాశ్రయం పనుల్ని చంద్రబాబు ఎప్పుడో ప్రారంభించారన్న కూన రవికుమార్.