1. యువతకు మంచి భవిష్యత్ను అందించాలనే ఆలోచనలను ఆచరణలో పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
100 కోట్లతో 3 పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సౌరభ్ గౌర్ సోమవారం గెజిట్ విడుదల.
2.గోరుముద్దలో మరో పౌష్టికాహారం..
నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
3. గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..
445 పోస్టులకు ఈ నెల 23 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్న ఏపీవీవీపీ.
4.మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
చైల్డ్ కేర్ లీవు సర్వీస్ ఎప్పుడైనా వాడుకోవచ్చని జగన్ సర్కార్ వెసులుబాటు.
5.సీఎం జగన్ ను కలిసిన వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు..
ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై టీడీపీ ఎమ్మెల్యే దాడిని వివరించిన శాసనసభ్యులు.
6.సొంత ఆర్ఆర్ఆర్ లో నటించి ఉంటే జగన్ కు ఆస్కార్ వచ్చేది..
రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని లోకేశ్ ఎద్దేవా.
7.వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్..
ఢిల్లీలో వెంకయ్య నివాసంలో ఉగాది శోభ
8.అసెంబ్లీ దాడి ఘటనపై తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి
విచారణ జరపాలని పోలీసులకు విజ్ఞప్తి
9.వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బరితెగించి వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు..
వారి అరాచకాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్న డోలా బాల వీరాంజయనేయస్వామి.
10.28, 29 తేదీల్లో ఢిల్లీలో ఓబీసీల జనగణన దీక్ష..
యావత్ బీసీలు తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు పిలుపు.