1.ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ.
2.వివేకా కేసు దర్యాప్తు నుంచి రామ్సంగ్ తొలగింపు..
సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ
3. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి..
పార్లమెంట్లో ఇచ్చిన విభజన హామీలను నిలబెట్టుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్
4.అనంతపురంలో వైఎస్సార్సీపీ నేత అప్పిచర్ల విజయభాస్కర్‌రెడ్డి హత్య కేసులో గుత్తి కోర్టు సంచలన తీర్పు…
టీడీపీ నేతలు శ్రీనివాసనాయుడు, గురుప్రసాద్ నాయుడికి జీవిత ఖైదు.
5.ఏప్రిల్ 30 లోపు వివేకా హత్య కేసు దర్యాప్తు ముగించాలి..
సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు
6.లోకేశ్ పాదయాత్రలో జేసీ దివాకర్ రెడ్డి..
జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శ
7.ఏపీలోని ప్రతి దానికి వైఎస్సార్ పేరు తగిలిస్తున్నారు..
చూస్తుంటే రాష్ట్రానికి కూడా వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని నామకరణం చేస్తారేమోనని రఘురామకృష్ణరాజు ఎద్దేవా.
8. టీడీపీని తీసి పారేద్దాం అనుకున్న వాళ్లంతా కొట్టుకుపోయారు..
పార్టీ విజయవంతంగా 41 ఏళ్ళు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నకేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.
9.వైసీపీ ఎమ్మెల్యేలెవరూ టీడీపీతో టచ్‌లో లేరు..
ఇదంతా చంద్రబాబు మైండ్ గేమ్ అంటూ అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి.
10.టీడీపీ ఆవిర్భావం రోజే.. లోకేష్‌కు ఎమ్మెల్సీగా లాస్ట్ డే..
ఇదే దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ చంద్రబాబుకి కొడాలి నాని చురకలు.