జగన్ సర్కారుకి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఏం జగన్ కి మరో వారం అనే చెప్పాలి. ఏపీలో మరో ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలోనే సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన సమయంలోనూ..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏపీ పర్యటన వేళ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందించారు. దీనిపైన సానుకూలంగా స్పందించిన కేంద్రం.. ఏపీలో ప్రాజెక్టుల కోసం 4,977 కోట్ల మేర నిధులు కేటాయించింది. ఏపీలో 85 రహదారి ప్రాజెక్టులకు ఈ మొత్తం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ లో కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ మొత్తం కేటాయింపులు చేసింది.ఈ మేరకు ఏపీకి 85 రహదారి ప్రాజెక్టులకు ఈ మొత్తం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2023-24 ఆర్దిక సంవత్సరంలో 4,977 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ లో పేర్కొంది. ఇందులో ఆదునికీకరణ, మరమ్మతులు, విస్తరణ పనులు ఉన్నాయి. అందులో ప్రధానంగా మాల కొండ నుంచి సింగరాయ కొండ వరకు ఉన్న జాతీయ రహదారి 167బి ఆధునికీకరణకు
120 కోట్లు, నాగార్జున సాగర్ డ్యాం నుంచి దావులపల్లి సెక్షన్ లో జాతీయ రహదారి 565కు 146 కోట్లు కేటాయించారు.