ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏపీ రాజకీయాలలో మరింత హీటు రాజుకుంది. ప్రజల్లో మార్పు మొదలయ్యిందని..ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ వైపే ఉన్నారని వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం పక్కా అంటూ ఆ పార్టీ నాయకులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే.. రాజకీయాలలో అసంతృప్తి, వ్యతిరేకత అనేది కామన్. ఇక ఈ నేపధ్యంలోనే చంద్రబాబుకి తాజాగా శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ సర్వే ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికీ ఈ సంస్థ ఏపీ వ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా తమ సర్వేలో వెల్లడించింది. ఇక నేపధ్యంలోనే ఓ కీలక స్థానంపై తమ సర్వే వివరాలను వెల్లడించింది. అయితే కచ్చితంగా వైసీపీ గెలిచే స్థానంలో నరసన్నపేట సీటు ఉంది. ఈ నియోజకవర్గంలో 2024లోనూ టీడీపీ గెలవడం కష్టమని సర్వే చెప్పేసింది. ఈ నిజవజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ధర్మాన కృష్ణదాస్ హవా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఆయనేవిజయం సాధిస్తారని సర్వే చెప్పేసింది. 2004లో ఫస్ట్ టైం గెలిచారు. 2009 2012 ఉప ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు. 2014లో ఒడినప్పటికీ.. మళ్ళీ 2019లో గెలుపొందారు. నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ ప్రజలకు చేస్తున్న మంచే.. వచ్చే ఎన్నికల్లో మరొకసారి ప్రజలు ఆయనను గెలిపించుకుంటారని ఏఎ సర్వే చెప్పింది. ఇక ఇక్కడ టిడిపి బాగా బలహీనంగా ఉందని, ఆ నియోజకవర్గంలో టిడిపి కి సరైన నాయకుడు లేకపోవడమే.. టిడిపి కి మైనస్ అని సర్వే వెల్లడించింది. అయితే..
నరసన్నపేట నియోజకవర్గంపై కింజరాపు రామ్మోహనరావు కన్నేశారని ప్రచారం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో రామ్మోహనరావు ఎమ్మెల్యేగా భరిలోకి దిగాలని భావిస్తున్నారట. కానీ అందుకు బాబు నాట్ ఒకే చెప్పారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే.. ఎవరు ఎన్నికల భరిలోకి దిగినా వచ్చే ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ ను ఓడించడం టీడీపీ వల్ల కాదని అక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు. ఇక అదే విషయాన్ని న్నే సర్వే కూడా వెల్లడించింది.