వైఎస్ వివేకా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ విచారణను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. నేడు సీబీఐకి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం వరకు అవినాష్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, కోర్టుకు మరిన్ని సీబీఐ మరిన్ని వివరాలు సమర్పించాల్సి ఉన్నందున తాత్కాలికంగా సోమవారం వరకూ ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ తర్వాత ఆయన అరెస్టుపై నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది.
వీడియోగ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్‌లు ఎప్పుడు సమర్పిస్తారని న్యాయస్థానం అడగగా.. తాము ఇప్పుడే కోర్ట్‌కి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ ఎస్పీ రాంసింగ్ కోర్ట్‌కు తెలిపారు. ఇప్పుడే న్యాయస్థానానికి ఇవ్వాలని ఆదేశించిన అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా అవినాష్ రెడ్డి నిందితుడా ? సాక్షి నా? అని న్యాయస్థానం ప్రశ్నించగా.. 160 CRPC కింద అవినాష్ రెడ్డికి నోటీసుల ఇచ్చామని, సాక్షిగా పరిగణించిన ఈకేసులో అవసరమైతే అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హత్యాస్థలిలో దొరికిన లేఖ తమ వద్దే ఉందని హైకోర్టుకు సీబీఐ చెప్పింది. లేఖపై సీఎఫ్ఎస్ఎల్ అభిప్రాయం తీసుకున్నామని, తీవ్ర ఒత్తిడిలో లేఖ రాసినట్లు CFSL తెలిపిందని సీబీఐ పేర్కొంది. మరోవైపు సునీత ఇంప్లీడ్ పిటిషన్‌పై అభ్యంతరం ఉందా అని హైకోర్టు అడిగింది. సోమవారం రోజు విచారణకు రావాలని అవినాష్‌ను కోరుతామని రాంసింగ్ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం న్యాయస్థానంలో విచారణ ఉంది కాదా అని గుర్తుచేసింది. దీంతో మంగళవారం విచారణ చేస్తామని సీబీఐ తెలిపింది.