సీబీఐకి అదిరిపోయే కౌంటర్ అవినాష్ రెడ్డి సీరియస్ యాక్షన్ షురూ

ఇంతకాలం సునీతా రెడ్డి నాపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా చట్టానికి కట్టుబడి మౌనంగా ఉండిపోయా.. కానీ చేయని నేరానికి ఈ కేసులో నన్ను ఇరికించాలని కుట్ర జరుగుతోందని తెలిసినా ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోలేనని.. ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఏ సాక్ష్యాధారాలు లేకుండానే ఓ ఎంపీ మీద హత్యానేరం ఆరోపిస్తూ కేసు నడిపించే సాహసం సీబీఐ ఎందుకు చేస్తోంది. ఘటనా స్థలంలో తమ చేతికి ఏదో లెటర్ దొరికిందని.. సీబీఐ చెప్తున్నప్పటికీ ఆ లెటర్ ని ఇంకా తమ వద్దనే ఎందుకు ఉంచుకుంది. అసలు ఆ లెటర్ లో ఏముంది అనేదే ఇక్కడ అసలైన ప్రశ్న. వీడియోగ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్‌లు కూడా న్యాయస్థానానికి సీబీఐ సమర్పించకుండా ఇంకా ఎందుకు తమ వద్దనే ఉంచుకుంది.ఆ ఆధారాలను ఎప్పుడు సమర్పిస్తారని న్యాయస్థానం అడగగా.. తాము ఇప్పుడే కోర్ట్‌కి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని సీబీఐ ఎస్పీ రాంసింగ్ కోర్ట్‌కు తెలిపారు. మొదటగా తమ వద్ద ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయస్థానానికి సమర్పించాలి. కానీ సీబీఐ మాత్ర౦.. వీడియోగ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్‌లు తమ వద్ద ఉన్నాయని స్వయంగా సీబీఐ అధికారులే చెప్పడం కొద్దిగా ఆశ్చర్యం కలిగించే విషయమే అని చెప్పాలి. వివేకా తన ఆస్తినంతా తన రెండవ భార్య కుమారుడికి రాసి ఇచ్చేశారనే అనుమానంతో ఆయన అల్లుడు, సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య జరిగిన తర్వాత ఆయన ఇంట్లో నుంచి ఆ డాక్యుమెంట్ మాయం అయ్యింది. అంటే ఆస్తి కోసమే ఈ హత్య జరిగిన్నట్లు అర్దమవుతోంది. కానీ సీబీఐ ఈ కోణంలో దర్యాప్తు చేయకుండా.. వేరే కోణంలో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అవినాష్ రెడ్డి అంటున్నారు. అవినాష్ రెడ్డి నిర్ధోషి అని విశ్లేషకులు అంటున్నారు.
ఈ కేసు సోమవారం హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.