బాబు విశాఖ టూర్ రంగంలోకి గంటా షాక్ ఇచ్చిన అయ్యన్న

అయ్యన్నపాత్రుడు ఏంటి షాక్ ఇవ్వడం ఏంటి..? ఇంతకీ అయ్యన్న ఎవరికి షాక్ ఇచ్చారు అనే కదా మీ అనుమానం. విశాఖలో తాజాగా జరిగిన బీసీ కార్యక్రమానికి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. విశాఖ తెదేపా కార్యాలయంలో విశాఖ లోక్ సభ నియోజకవర్గ బీసీ సెల్ కమిటీ కార్యక్రమానికి అయ్యన్నపాత్రుడు దూరంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ కార్యక్రమానికి గంటా శ్రీనివాసరావు సైతం హాజరయ్యారు. అసలైన కిటుకు ఇక్కడే ఉంది. గంటా శ్రీనివాసరావుకి, అయ్యన్నపాత్రుడుకి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనే విభేదాలు ఉన్నాయని ఆ పార్టీలో ఉన్న నాయకులే చర్చించుకుంటున్నారు. అసలు ఈ అలకల యవ్వారం ఎందుకు తెరపైకి వచ్చింది అంటే.. ఈ నెల 5 వ తేదీన చంద్రబాబు విశాఖ పర్యటన ఉండగా.. ఆ బాధ్యత అంతా గంటా శ్రీనివాసరావుకే అప్పగించింది పార్టీ అధిష్టానం. దీంతో అయ్యన్న అలిగారు అంటూ.. ప్రచారం సాగుతోంది. సీనియర్ నాయకులై ఉండి.. ఇలా అలగడం ఏమైనా బాగుందా అని సొంత పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. బాబు విశాఖ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇవ్వడంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వెల్లగక్కారని అక్కడి టాక్. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు వరకు అసలు గంటా టిడిపి లో ఉన్నారా లేదా అనేంతలా వ్యవహరించారు. ఆయన పార్టీ మారబోతున్నారు అన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. ఆ సమయంలో అయ్యన్న పార్టీ కోసం బాగానే కష్టపడ్డారు. తీరా ఇప్పుడు పెత్తనమంతా తీసుకెళ్ళి గంటా చేతిలో పెట్టడం అయ్యన్నకి అస్సలు మింగుడు పడినట్లుగా లేదేమో. అందుకే ఈ మధ్య ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని లోకల్ టాక్. అంతేకాదు అలిగిన అయ్యన్న.. చంద్రబాబు విశాఖ పర్యటనకు కూడా దూరంగా ఉండాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయ్ కి టికెట్ ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి గంటా