అబద్దం.. అబద్దం.. అంతా అబద్దం… చంద్రబాబు 40 ఏళ్ల పొలిటికల్ లైఫ్ లో ఏనాడైనా నిజం చెప్పావా..? నోరు గుక్క తిప్పుకోకుండా అబద్దాలు చెప్పడం ఆయనకే సాటి. తాను చేయనిది చేసినట్టుగా గొప్పలు చెప్పుకోవడంలో ఎవరైనా బాబు తర్వాతే. విజన్ అంటూ ప్రజల్ని నమ్మించడం, ఆపై డబ్బులు దండుకోవడం బాబుకి వెన్నతో పెట్టిన విద్య. నాడు మోసం చేసి… నేడు నీతిమంతుడిలా కవరింగ్ ఇచ్చుకోవడం ఆయన కన్నింగ్ మైండ్ కే సాధ్యం. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అంటాడు.. 5G కనిపెట్టింది కూడా నేనే అంటాడు. కానీ అయిదేళ్లల్లో రాజధానిలో 20% కూడా కట్టలేకపోయాడు. మళ్ళీ ఇప్పుడు అవే అబద్దాలు. అవే మోసపు మాటలు. చంద్రబాబు తీరే అంత.. అందితే జుట్టు అందకపోతే కాళ్లు. ఇప్పుడు చంద్రబాబు కొత్త రకం పలుకులు పలుకుతున్నారు. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు , జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థ నేను కొనసాగిస్తా అంటున్నాడు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇంకా కొత్త పథకాలకు శ్రీకరం చూడతా అంటూ ప్రకటిస్తున్నారు. చంద్రబాబు నీ రెండు నాలికలని నమ్మడానికి జనం చెవిలో పూలు పెట్టుకుని కూర్చున్నారా..? ఉచితాలు అమలు చేసి జగన్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చేస్తున్నారని అంటావు. సంక్షేమ పథకాలు ఇచ్చి జనాన్ని సోమరిపోతుల్ని చేస్తున్నారని ప్రచారం చేశావు. జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పులపాలవుతుందని అంటావు. అలా అంటూనే.. ఇప్పుడు మళ్ళీ జగన్ ఇచ్చే పథకాలను కంటిన్యూ చేస్తా.. ఇంకా మరిన్ని పథకాలు అమలు చేస్తా అంటున్నావు. మరో వైపు తమరి కామెడీ పుత్రుడు కూడా అదే తీరు. అవే అబద్దాలు. అవే మోసపు హామీలు. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్లను కొనసాగిస్తాం అంటాడు. మళ్ళీ జగన్ పాలనపై బురదజల్లుతాడు. నాడు బాబు వస్తే జాబు అన్నాడు.. మీ బాబు. ఇచ్చాడా..? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చాడా..? రైతులకు ఋణమాఫీ అన్నాడు చేశాడా అంటే అదీ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో మీరు ఇచ్చిన 600 హామీలలో పట్టుమని పది హామీలైనా నెరవేర్చారో లేదో మీకే తెలియాలి. ఇవే నారా వారి చుట్టుముట్టే కథలు, జవాబు లేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు.