1.ఇరిగేషన్ ను సస్యశ్యామలం చేయాలని వైఎస్సార్ జలయజ్ఞం తీసుకువచ్చారు.పోలవరం ప్రతీ నీటి బొట్టుపై ఆయన పేరే ఉంటుంది.
పోలవరం మా హయాంలోనే పూర్తి అవుతుందని అసెంబ్లీలో మంత్రి అంబటి స్పష్టం.
2. ఏపీలో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
మొదలైన కౌంటింగ్ ప్రక్రియ. గెలుపుపై వైసీపీ ధీమా వ్యక్తం.
3.జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో చంద్రబాబు హయాంలో కేవలం 36మంది వైద్యులున్నారు..
సీఎం జగన్ హయాంలో 96మంది వైద్యులు అందుబాటులో ఉన్నారని మంత్రి విడదల రజని వెల్లడి.
4. పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం..
చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదని అసెంబ్లీలో సీఎం జగన్ ఫైర్.
5.వసంత కృష్ణ ప్రసాద్ కు, నాకు మధ్య గొడవేం జరగలేదు..
సోషల్ మీడియాలో హేయమైన ప్రచారం జరుగుతోందని పేర్ని నాని మండిపాటు
6.దేశవ్యాప్తంగా 16 కోట్ల మంది డేటా చోరీ..
ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు.
7. ఆత్మప్రబోధానుసారమే ఓటు వేశా..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
8.ఏపీ హైకోర్టు తరలింపు వ్యవహారంలో నేడు పార్లమెంట్ లో చర్చ..
రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు కూడా కలిపి ఉమ్మడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పేసిన కేంద్రం.
9.ఎప్పుడూ ఎవరిని మందలించని సీఎం జగన్ .. ఇప్పుడు భయంతో అందరితో మాట్లాడుతున్నారు..
అంతరాత్మ ప్రబోధం ప్రకారం మిగతా వారు కూడా ఓటు వేస్తారని రఘురామ వ్యాఖ్యా.
10.పోలవరం ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..
ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం