చిలకలూరిపేట మొక్కకు ప్రత్యర్ధిగా బాబు భారీ వ్యూహం

వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు స్టంట్ లు చేయబోతున్నారా..? బాబును టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై బాబు గట్టి ఫోకస్ పెట్టారా..? అధికారం దక్కించుకోవాలని బాబు తన పట్టుదలను నెగ్గించుకోగలుగుతారా..? అసలు బాబు స్టాండ్ ఏంటి..? 2019 ఎన్నికల్లో 151 నియోజకవర్గాలను కైవసం చేసుకొని.. ఇప్పటికీ బలంగా ఉన్న సిఎం జగన్ ను చంద్రబాబు ఎదుర్కోగలరా..? ప్రస్తుతం.. ఇవే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాలలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబుకు అస్సలు అలవాటులేని పనిలో బిజీగా ఉంటున్నారు. అదే.. ఏడాది ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. గతంలో నామినేషన్లు వేసే చివరి రోజువరకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయకుండా తాత్సార ధోరణితో చంద్రబాబు వ్యవహరించేవారు. ఇప్పుడు మాత్రం జగన్ తాకిడికి తట్టుకోలేక భయంతో… ముందు చూపుగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి రజిని అడ్డా చిలకలూరిపేట నియోజకవర్గంలో నందమూరి సుహాసిని టీడిపి తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈమె నందమూరి హరికృష్ణ కూతురు. మరి ఈ సెంటిమెంట్ చిలకలూరిపేటలో వర్క్ ఔట్ ఔతుందా..? ఒకవేళ నందమూరి సుహాసిని చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తే.. జూనియర్ ntr, కళ్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారం చేస్తారా..? అంటే చెప్పలేని పరిస్థితి. నందమూరి సుహాసిని తెలంగాణలో జరిగిన 2018లో ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ సమయంలో జూనియర్ ntrసైతం ఎన్నికల ప్రచారం చేశారు. కానీ అక్కడ నందమూరి సెంటిమెంట్ వర్క్ ఔట్ అవలేదు. నియోజకవర్గంలో మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు పోటీకి రెడీ అవుతున్నారు .. మరి అలాంటి బలమైన నేతను తప్పించి.. చంద్రబాబు సాహసం చేస్తారా..? అన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న. చిలకలూరిపేటలో మంత్రి విడుదల రజినికి కూడా మాంచి ఫాలోయింగ్ ఉంది. 2019 వరకు టిడిపి కి కంచుకోటగా ఉన్న చిలకలూరిపేటను వైసీపీ బద్దలు కొట్టింది. తాజాగా చిలకలూరిపేటలో జరిగిన సభలో మంత్రి రజిని కంటతడి పెట్టుకొని.. పేట ప్రజల సిపతీని కొట్టేసింది. వచ్చే ఎన్నికల్లో పేటలో మళ్ళీ మంత్రి రజినిని గెలిపించుకుంటామని నియోజకవర్గ ప్రజలు ముక్త కంఠంగా చెప్తున్నారు. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట సీటు నందమూరి సుహాసినికే అంటూ సాగుతున్న ప్రచారంలో నిజానిజాలు తేలాలు అంటే.. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.