కేతిరెడ్డి చేతిలో ఎల్లో మీడియాకి మూడింది ఆధారాలతో సహా బుక్కయిన బాబు

తప్పుడు కధనాలను వండి వార్చడంలో ఎల్లో మీడియాకి అలవాటే. ఎప్పుడు ఎలాంటి నేరాన్ని మోపాలా.. జగన్ సర్కారుపై ఎప్పుడు ఎలా బురద చల్లాలా అని గోతికాడ నక్కలా ఎదురు చూడటమే ఈ ఎల్లో మీడియా పని. పేద ప్రజలకు మంచి చేసే ప్రభుత్వంపై ఇలా తప్పుడు కథలు రాస్తే చివరికి పుట్టగతులు లేకుండా పోతారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. నిన్న నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో సిఎం జగన్ ప్రయాణించబోయే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో సిఎం జగన్ కాన్వాయ్‌ లో పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్తున్న నేపధ్యంలో ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద కొందరు రైతులు సిఎం కాన్వాయ్‌ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక దీనిని అవకాశంగా తీసుకొని ఎల్లో మీడియా ఇష్టమొచ్చినట్టు వార్తలు ప్రచారం చేసింది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సిఎం జగన్ పరువు తీశారంటూ.. ధర్మవరంలో దగా పడ్డ రైతన్న అంటూ.. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు న్యాయం దక్కలేదంటూ.. ఎల్లో మీడియాలో నిన్నటి నుండి వార్తలు తెగ ప్రాచారం అవుతున్నాయి. ఎల్లో మీడియా మొత్తం నిన్నటి నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై పడి ఏడవడమే పనిగా పెట్టుకొని.. వేసిన న్యూసే వేస్తూ.. కథలు కథలుగా అల్లారు. అయితే.. ఎల్లో మీడియాకి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఝలక్ ఇచ్చారు. ఎల్లో మీడియాలో ప్రచారం అవుతోన్న తప్పుడు కథానాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి రియాక్ట్ అయ్యారు.

అసలు సిఎం జగన్ ఆ రూట్ లో వెళ్తున్నట్టు ఎవ్వరికీ తెలియదని, కనీసం తనకి కూడా తెలియదని ఎమ్మెల్యే వివరించారు. షెడ్యూల్ లో ఉంటే సిఎం జగన్ తన కాన్వాయ్ ఆపి రైతులతో మాట్లాడేవారు. కానీ ఆ రూట్ లో సిఎం జగన్ వెళ్తున్నట్టు ఎవ్వరికీ తెలియదు. అలాంటప్పుడు అక్కడికి ABN, TV5, ENADU,వారు ఎలా వచ్చారు.. ఇదంతా టీడీపీ ఫ్రీ ప్లాన్ డ్ నాటకం అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. దానికి సంబందించి .. పక్కా ఆధారాలను కూడా ఎమ్మెల్యే బయట పెట్టారు. అధికారం ముసుగులో అడ్డదారులు తొక్కుతూ.. ఓట్ల కోసం 2018లో చంద్రబాబు చేసిన తప్పును ఇపుడు మాపై రుద్దాలని చూస్తారా అంతరు కేతిరెడ్డి మండిపడ్డారు. ఓట్ల కోసం అనర్హులకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చింది చంద్రబాబే, అమాయక ప్రజల వద్ద నుండి అన్యాయంగా బుములు లాక్కొని మరీ లేఔట్ లేకుండా ఇళ్ల భూములను చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. అప్పుడు సీపీఐ వాళ్ళు కూడా ధర్నా చేశారని ఎమ్మెల్యే ఆధారాలతో సహాయ నిరూపించారు. ద్రాక్ష తోటల్ని జీసీబీతో పీకించి మరీ భూములు లాక్కున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. అలా భూములు లాక్కొని. వారికి రూపాయి కూడా ఇవ్వకుండా పంగనామం పెట్టింది అప్పటి టిడిపి ప్రభుత్వమేనని ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధారాలను బయటపెట్టారు. నాడు ఇదే రైతుల తరుపున నేను కూడా పోరాడానని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ సంగతహి ఇక్కడ ఎవర్ని అడిగినా చెప్తారని క్లారిటీ ఇచ్చారు. కానీ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబుతో కలిసి ఎల్లో మీడియా ఇలా అడ్డదారులు తొక్కడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే ఎల్లో మీడియాకి కౌంటర్ ఇచ్చారు.