బాబుకి 23 -23 పరువు అడ్డంగా పాయే సోషల్ మీడియాలో వైరల్

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉత్కంఠ నెలకొంది. ఈ పద్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మొదటగా సీఎం జగన్ తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చంద్రబాబు కూడా
తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను ఇకపై అసెంబ్లీ కి రాను అంటూ శపథం చేసి మరి.. అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయిన సంగతి తెలిసింది. కొంత కాలంగా అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు బహిష్కరించారు. తిరిగి సీఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసారు. సుదీర్ఘ విరామం తరువాత అసెంబ్లీకి వచ్చారు. అయితే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయడానికి అసెంబ్లీకి వచ్చిన తరుణంలో చంద్రబాబుపై సోషల్ మీడియాలో నెటిజెన్లు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. మంగమ్మ శపథం చేసి ఆ శపదాన్ని పక్కనపెట్టి అసెంబ్లీకి రావటం ఏంటి బాబు గారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న బాబు మళ్ళీ తాను సిఎం అయిన తర్వాతేనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ.. 23వ తేదీన ఓటు వేయడానికి అసెంబ్లీకి వచ్చారని సోషల్ మీడియాలో ట్రోల్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.
తొలుత వైసీపీ నుంచి ఏడుగురు అభ్యర్దులు నామినేషన్లు దాఖలు చేయటంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమని అందరూ భావించారు. సడన్ గా చంద్రబాబు వ్యూహం మార్చారు. పార్టీ నుంచి పంచుమర్తి అనురాధను ఎన్నికల బరిలో దించారు. ఏడుగురు అభ్యర్దులు గెలవాలంటే ఒక్కోక్కరికి 22 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందులో భాగంగా వైసీపీకి తాజా సమీకరణాలతో 154 మంది ఎమ్మెల్యేల మద్దతు సరిగ్గా సరిపోతోంది. టీడీపీకి 21 మంది మద్దతు కనిపిస్తోంది. ఒక్క ఓటు పెంచుకొనేందుకు టీడీపీ చివరి వరకు ప్రయత్నించింది. మరి ఆ ఒక్క ఓటు టిడిపి కి దక్కుతుందా లేదా అనేది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.